పుట:Gurujadalu.pdf/543

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొండుభొట్టీయము

ద్వితీయాంకము

అష్టమరంగము

(అక్కాబతుడి దుకాణం)

(అక్కాబత్తుడు - రామమూర్తి ప్రవేశించును)

అక్కా : యిక రామమూర్తి అని పిలవకూడదు. రామమూర్తి పంతులుగారు అని పిలవాలి.

రామ : యేదో పెద్ద ఉద్యోగాలు అయినప్పుడు గదా అలా పిలవడం.

అక్కా : అందాకా మామూలుగా పిలవొచ్చునా?

రామ : యేం చదువు - యేం వుద్యోగాలు.

అక్కా : యేం అలా అంటున్నారు.

రామ : మా తండ్రి సంగతి బాగుంది కాదు. ఆయనకి మంచి స్నేహితులైన మీలాంటి వాళ్లు కూడదని చెప్పరు - 

అక్కా : ఆయ్ని యే కూడని పని చెయ్యలేదే. యేదో ఉపాయం వల్ల పదిరాళ్ల సొమ్ము ఆర్జించుకుని సంసారం గడుపుకుంటున్నాడు.

రామ : యెవడో షోళంగిరాజును యీ వేళ యింట్లో దింపి పార్వతిని వాడికి ఉపచారం చెయ్యమని అప్పచెప్పారు. ఈ దౌర్జన్యం చూశారా? 

అక్కా : “భార్యా రూపవతీశత్రు?” అన్నాడు. మొగుడున్న పెళ్ళామే సొగసుగా వుంటే పరాయి వాళ్లు కన్నేస్తారు గదా! ఖాయిదా లేకుంటే సొగసైన వితంతు చెడిపోవడమనగా యెంతసేపు?

రామ : మా తండ్రికి అలాగ్గడ్డి పెట్రాదా?

అక్కా : మీ తండ్రికి గడ్డి పెడితే గడ్డయ్యేది గట్రయ్యేది సాపుగా తినేస్తాడు. అయినా ఆయిన ప్రతిబంధకం మీ ప్రయత్నానికి అడ్డవుతుందా యేమిటి? పెళ్ళి మూర్తం యెప్పుడండి?

రామ : యెవరి పెళ్లండి?

అక్కా : యవరి పెళ్లనుకున్నారు?

రామ : నా పెళ్లి?

అక్కా : ఆ మాటే - మీ పెళ్లి - పార్వతమ్మ పెళ్లిన్నీ.

గురుజాడలు

498

కొండుభొట్టీయము