పుట:Gurujadalu.pdf/537

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొండు : నువ్వు కాకనేకాదంటె-చెబుతాను కాని, కోరి లభించిన ధనంకాళ్లని తన్నుకుపోవడమే?

రత్నాంగి : పేరు... పేరు?

కొండు : అయితే విను (పొడుం పీల్చి) అక్కాబత్తుడు

రత్నాంగి:కంసాలాడి శ్రీరంగనీతులన్నీ వొట్టివేనా?

కొండు : మరేవిఁటనుకొన్నావు. లోకమంతా అంతే - నీలాంటి ధనవొల్లని వెర్రికుట్టె యెక్కడో వుంటారు - నా మాట విను.

రత్నాంగి:ముందు నా మాట వింటే - ఆ తరువాత నీ మాట ఆలోచిస్తాను.

కొండు : నీ చిత్తం - నువ్వేమి చెబితే అది చేస్తాను.

రత్నాంగి: గదిలోనికి యేలా వొచ్చావో చెప్పు.

కొండు : యేకవచనం ప్రయోగిస్తూన్నావేమిటి?... యక్ష ప్రశ్నలడుగుతున్నావు. నా వంటి మంత్రవేత్తకి తలుపులు - గోళ్ళూ ఒక అడ్డా?

రత్నాంగి:అయితే ఆ మంత్రం వల్లే పైకిరా - యీ జాడీపైన పెట్టించి పైనుండి తాళం వేస్తాను.

కొండు : గదిలో ప్రవేశించడానికి యేం బ్రహ్మవిద్య కావాలి? మారు తాళం పెట్టి తీశాను.

రత్నాంగి:యే మనిషి నీకు సాయం చేసింది?

కొండు : నా కొకరి సాయం కూడా కావాలా?

రత్నాంగి: పేరు?

కొండు : చెప్పకపోతే?

రత్నాంగి:పట్టి అప్పచెపతాం

కొండు : పట్టి అప్పచెప్పితే ప్రాణత్యాగం చేస్తాను - బ్రహ్మహత్య నిన్ను చుట్టిముట్టి శేషువులాచుట్టుకుంటుంది.

రత్నాంగి:అయితే చెప్పిన మాటకి జవాబు చెప్పండి.

కొండు : పేరుకే వుంది. (పొడుం పీల్చి) అంకి.

రత్నాంగి:అబద్ధం!

కొండు : అయితే - పైడి

రత్నాంగి:అబద్ధం!

గురుజాడలు

492

కొండుభొట్టీయము