పుట:Gurujadalu.pdf/536

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొండు : యెందుకు వృధా శ్రమ-నలుగురికీ తెలియడం. నా మాట విని యీ గావంచా గుడ్డలో కట్టు (గావంచా చుట్ట చుట్టి రత్నాంగికి విసురును) నీకు యీ విద్యలో ప్రావీణ్యత తక్కువగా వున్నట్టు కనబడుతుంది.

రత్నాంగి : బంగారం యెవరు కరిగిస్తారు?

కొండు : యిదుగో మన......

రత్నాంగి:మన యెవరు?

కొండు : యెవరయితేనేం పేరడక్కు

రత్నాంగి:నమ్మినట్టా? నమ్మనట్టా?

కొండు : కావలిస్తే నువ్వు కూడా దగ్గిరవుందువు కాని.....

రత్నాంగి:అయితే పేరు చెప్పరా?

కొండు : యేదీ! గ్రంథంలో దిగిన తరువాత అసలు అవతారాలె దీగుతాయి - పేర్లతో యేం పని?

రత్నాంగి : అయితే పేరు చెప్పరా?

కొండు : నీ పుణ్యం వుంటుంది - కొంచెం ఆసరా యియ్యి పైకి వొచ్చి అన్ని సంగతులు చెబుతాను. వీటి తస్సాగొయ్యా బొద్దెంకలు చెడకరుస్తున్నాయి.

రత్నాంగి:బొద్దెంకలు కరవ్వు కొంచెం దాళండి. యీ జాడి పెట్టించి మళ్లి వస్తాను.

(తలుపు దగ్గరికి వెళ్లి ఘడియతీయనారంభించును. )

కొండు : అంతా నువ్వే అవుపోసం పడతావు? కొంచెం బ్రాహ్మడికి పారెయ్యకపోతే శ్రేయస్సు కాదు... ఆ ధనంలో మూడో వంతు నా మంత్రాంగమువల్ల రామసాని సంపాదించింది.

రత్నాంగి:(తలుపు కొంచెం తీసును - కొండుభొట్లు తల జాడీలోకి తీసును)

రత్నాంగి : ఆ తగాయిదా యేదో మంజువాణితో తీర్చుకొండి. పిలుస్తాను.

కొండు : (బుర్రపైకెత్తి) అమాంతంగా చంపేస్తావా యేమిటి?

రత్నాంగి : అయితే పేరు చెప్పండి.

కొండు : చెప్పకపోతే యేం జేస్తావు?

రత్నాంగి:మంజువాణ్ణి పిలుస్తాను -

గురుజాడలు

491

కొండుభొట్టీయము