పుట:Gurujadalu.pdf/529

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



అక్కా : యెవడో కట్టలేదు. వీధి దగ్గిర నిలుచుని తోవంటెపోయే వాళ్ళని చూస్తూవుంటే, మీ మేనత్తతో ఖాయిదా పెట్టమనినే చెప్పాను. అంచేత చేతులు కట్టింది.

వెంక : మా మేనత్త కడితే రాముడు నన్నెందుకు కొట్టాడు ?

అక్కా : నీ సత్యకాలము చూసి. రామమూర్తికి గూబకదలేశావు కాదు.

వెంక : రాముణ్ణి కొడుతానా! వాడ్కి మునసబీ అయితే “వారే రాముడూ” అని పిలుస్తాను. వాడి పెళ్ళి చేస్తాను.

అక్కా : నువ్వే చేస్తావూ?

వెంక : (పొడుం పీల్చి) ఆ నేనే! మా చిన్నాన్న వచ్చి నన్ను కౌగలించుకు యెత్తి యింటికి తీసుకుపోయినాడు. యివాళనుంచి మా యింట్లోనే భోజనం. ష్టాంపు సంతకము చేసి వెయ్యి రూపాయీలు తెచ్చి మా మామకిచ్చాను.

అక్కా : యంత బుద్ధి తక్కువ పనిచేశావు. నాతో చెప్పందీ యెందుకు సంతకం జేశావు.

వెంక : రాముడికి పెళ్లి చెయ్యవొద్దంఛావా యేమిషి?

అక్కా : యంత పనిచేశావు! (ఆత్మగతం) దీనికేమిటీ ప్రతీకారం? (ప్రకాశముగా) రెయిలు వేళయింది పొట్లాలు పంపించు.

(యిద్దరూ నిష్క్రమింతురు. )

కొండుభొట్టీయము

ద్వితీయాంకము

షఠ్విరంగము

(కొండుభొట్లు ప్రవేశించును.)

(రెయిలు వచ్చును. ఫస్టు క్లాసు బండిలో, జరీ టోపీ, కన్ కాఫ్ ఫాయిదామా మొదలయ్న పోషక్ వేసుకొని త్రివిక్రమరావు పంతులు కిటికీలో నుంచి తొంగిచూచి “అల్లీఖాన్- అల్లీఖాన్” అని నౌఖర్ను పిలుచును.)

కొండు : యే తాలూకా వారు వీరు - యే తాలుకా రాజా వారు వీరు (అని దగ్గర నున్న వార్ని అడుగును.)

దగ్గిర వున్నవారు : మాకు తెలియదు.

గురుజాడలు

484

కొండుభొట్టీయము