పుట:Gurujadalu.pdf/528

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



వెంకన్న : వొరే రాముడూ! వంట ఓ సొగసుగా చేస్తానూ.... చినబాబు దేశాంతరం వెళ్ళుతే నేనే గద వండుతాను. యీ రాత్రి వుల్లిపాయల పులుసు చేస్తాను వస్తావా?

రామమూర్తి : యెందుకు శ్రమ పడుతావు. నా మాట విని యింటికి వెళ్ళిపోయిరా.

వెంకన్న : యెంత డబ్బొస్తూందంటావంటె... రెయిలు వచ్చినప్పుడల్లా అక్తాబత్తుడు పొట్లాలు పంపిస్తాడు. ఒక రూపాయి పొట్లాలు చెల్లుతాయి. మా పొడుం వూరు వూళ్ల వాళ్లు కొనుక్కుపోతారు. వఝ్ఝలు కొట్టు యెత్తేశాడు. ఒక రహశ్యం విన్నావూ.

రామమూర్తి : ఆరహశ్యమేమిట్రో?

వెంకన్న :పొడుం షడక్షరని ఒక మహా మంత్రం వుంది. కంసాలి గురువు వీరనాభాచార్యులు దగ్గిర ఉపదేశమయి పునశ్చరణ చేశాను. శిద్ధయింది.

రామమూర్తీ : నాకు చెప్పుతావురా ఆ మంత్రం.

వెంకన్న : చెప్పుతే తల పేలిపోతుందీష, ... గురువు చెప్పాడ్రా...

రామమూర్తి : మంత్రాలబద్ధం. శ్రమపడి పునశ్చరణ చెయ్యకు.

వెంకన్న : అదొక్కటేన్రా? నీ దగ్గిర దౌర్భాగ్యపు గుణం... తెల్లవాడి మాట నమ్మేసి మన గ్రంథాలన్నీ అబద్ధం అంఛావు... నాకు దాఖలా యిస్తేనే. స్వప్నంలో మంత్ర దేవత నానా భర్ణ భూషితురాలవు కుంచున్నూ బంగారపు పొడుం కర్రతో వీపు మీద వేశింది. దాంతో తెలివొచ్చింది. మరి ఆవేళ నిద్రపోలేదు. నిద్రపోతే ఫలం పోతుందిష.

రామమూర్తి : పూర్ ఫూల్ (poor fool).

కొండుభొట్టీయము

ద్వితీయాంకము

పంచమ రంగము

(అక్కాబత్తుడు, వెంకన్న ప్రవేసించును.)

అక్కా : యేమిటి కబుర్లు?

వెంకన్న: మా రాముడు పరీక్ష ప్యేసు అయినాడు? యీ వేళే పట్నం నుంచి వచ్చి వో లెంపకాయ తీశాడు.

అక్కా : యెందుకేమిటి?

వెంక : పార్వతి చేతులు యెవడో కట్టాడుష,

గురుజాడలు

483

కొండుభొట్టీయము