పుట:Gurujadalu.pdf/527

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ : (కూర్చుని ఆశ్చర్యముతో) యేంచేతరా? అబద్దమాడిందా.... అబద్దమాడి వుండదు.... నే వినడం తప్పు కావచ్చును... యెంచేతరా నెలరోజులాయి ఇంటికి వెళ్ళలేదు?

వెంక : యెంచేతనంటే... చెప్పకుమా పొడుం కొట్టు పెట్టుకున్నాను.

రామ : మా నాన్న గెంటేశాడా యేమిటి?

వెంక : మీ నాన్న నెలరోజులాయి వూళ్ళో లేడు.

రామ : నీ మానాన్న నువ్వు బతకాలని బుద్దిపుట్టిందా యేమిటి?

వెంక : అవును రాముడు. పొడుం మా బాగా తయారుచేస్తాను. మీ తట్టు పొడుం యిలా వుంటుందిరా. ఒక పట్టు పీల్చు

రామ : (పీల్చి) మా మజాగా వుందిరా. ఏం వేస్తావేమిటి?

వెంక : యే వేస్తానా? మకోబా పిక్క వేస్తాను... ఘుమఘుమలాడుతుంది. ఓ పెద్ద పొట్లం పుచ్చుకో... నీకు యెప్పుడు కావలిస్తే అప్పుడు పొట్లాము యిస్తాను.

రామ : వెంకన్నా! నీవు చాలా మంచివాడివిరా.

వెంక : నేను మంచివాణ్ణిరా?

రామ : అవును.

వెంక : మరి నన్నెందుకు కొట్టావు?

రామ : బుద్ది తక్కువచేత !

వెంక : మరెప్పుడూ కొట్టవు గద?

రామ : కొట్టను.

వెంక : రాముడు ! నువ్వు మునసబు పనిచేస్తూ వుంటే నేను వచ్చి, “వారె రాముడు!” అని పిలుస్తాను. కోప్పడవు గద.

రామ : కొప్పడను... యింటికెళ్ళిపోయిరా!

వెంక : అమ్మా.. నేను రాన్రా.

రామమూర్తి : యిన్నాళ్ళు అన్నదమ్ముల్లా ఉండి, యిప్పుడు వేరుంటావురా?

వెంకన్న: చీపురుగట్ట ... (అని వీపు తడుము కొనును.)

రామమూర్తి : నీకేం ప్రాలుబ్దం. చీపురుగట్టతో స్వయం యిల్లు తుడుచుకోవడం... వంట చేసుకోవడం నాకేం మనస్కరించలేదు.

గురుజాడలు

482

కొండుభొట్టీయము