పుట:Gurujadalu.pdf/523

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పార్వ : యింకా వుంది.

వెంక : యేమిటుంది?

పార్వ : యిదిగో (అని కౌగిలించుకొనును)

వెంక : వెధవముండా (అని విదిలించివేయును. పార్వతి నేలబడును, వెంకన్న పైకి పారిపోయి అరుగు మీద ముసుగు పెట్టికుని పడుకొనును. (తనలో) చచ్చానురోయి! యిదేమిటీ రంకుముండకి కాలం... రామ... రామ!

పార్వ : (చీపురు కట్ట తెచ్చి) గాడిద కొడుకా.. (అని కొట్టును)

(తెర దించవలెను)

ద్వితీయాంకము

ద్వితీయ రంగము

(అక్కాభక్తుడి యిల్లు)

వెంక : అక్కాబత్తుడూ - అక్కాబత్తుడూ (అని తలుపు కొట్టును)

అక్కా : యెవరది?

వెంక : వెంకన్న

అక్కా : (తలుపు తీసి పైకి వచ్చి) యేమిటి వెంకన్న.

వెంక : కొంప ములిగింది.

అక్కా : ములగడానికి నీకు కొంప వుంటేనా? మీచ్నిబాబు గారి కొంప ములిగినట్ట్నాయిన, శుభవార్త చెప్పు.

వెంక : కొంప ములిగింది.

అక్కా : యెందుకు తొందర - నింపాదిగా చెప్పు - దొంగలొచ్చారా? యిల్లంటుకుందా? యేదయ్నీ సంతోషమే.

వెంక : చెప్పనా?

అక్కా : (అరుగుమీద కూర్చుని) చెప్పు.

వెంక : నేను చెప్పను.

అక్కా : చెప్పకపోతే యింట్లోకి పోయి వెచ్చగా పరుంటాను. (లేచి తలుపు వైపు పోవును. )

గురుజాడలు

478

కొండుభొట్టీయము