పుట:Gurujadalu.pdf/521

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొండుభొట్టీయము

ద్వితీయాంకము

ప్రథమ రంగము

(కొండిభొట్లు యింటి అరుగుమీద చాప పరుచుకొని వెంకన్న కూర్చుని చుట్ట చేతితో పట్టుకొనును.)

వెంక : రాముడు చుట్ట మా ఠీవిగా కాలుస్తాడు. ముక్కులోంచి పొగ తెప్పిస్తాడు. ఆ విద్య పట్టుపడింది కాదు. (అగ్గిపుల్ల వెలిగించి చుట్ట ముట్టించుచుండగా తలుపు తియ్య బడును) (చటుక్కున చుట్ట, అగ్గిపుల్ల పారవేశి, తటాలున ముసుగెత్తి పడుకొనును) పార్వతమ్మ ప్రవేశించి గుమ్మము దగ్గర నిలువబడి; మెల్లగా “వెంకడూ! వెంకడూ” అని పిల్చును. వెంకన్న మారు పలకక నిద్రించినట్టు నటించును. పార్వతమ్మ అరికాలుగోకి తిరిగి నిమ్మళముగా “వెంకడూ, వెంకడూ! అని పిలుచును.

వెంక : (కాలు ముడుచుకొని) నిద్రపోతున్నానే.

పార్వ : దొంగనిద్ర పోతున్నావు! నువ్వు చుట్ట కాల్చడం సొంపు చూడలేదనుకున్నావా యేమిటి?

వెంక : చూశావూ?

పార్వ : చూశాను.

వెంక : బాబుతో చెబుతానంచావా యేమిషి? కాల్చడం మానేస్తానులే.

పార్వ : నే చెప్పినమాట వింటే చెప్పనులే గదా, చుట్టలు కొనడానికి రూపాయిలు కూడా యిస్తాను.

వెంక : చుట్టల శిఘాగోశెనుగాని, పది రూపాయలంటూ యిచ్చావంటె పొడుం దుకాణం పెట్టుకుంఛాను.

పార్వ : చెప్పినట్టు వింటె, పది కాదు యిరవై రూపాయీలు యిస్తాను....... యిప్పుడె యిమ్మంటావా యేమిటి ?

వెంక : యిచ్చావంటె నీకన్న పుణ్యాత్మురాలుందా?

పార్వ : అయితే లోపలికిరా... (అని గదిలోనికి వెళ్లును)

వెంక : (సావిడిలోనికి వచ్చి నిలుచుని పొడుం పీల్చి) పార్వతీ బహుదొడ్డ మనిషి... బాబుకంటె నయం. నేను పొడుంకొట్టు పెట్టానంటె వఝ్ఝల కొట్టుమీద వక్క దమ్మిడీ పొడుం చెల్లదు.

గురుజాడలు

476

కొండుభొట్టీయము