పుట:Gurujadalu.pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొండుభొట్టీయము

ప్రథమాంకము

పంచమరంగము

(కొండిభొట్లు యింటి పెరట్లో పెంకిటిసాల, పొయి మీద నీళ్ళకాగు. పొయ్యిలో నిప్పు లేదు. నీరుకాయ పంచ అంగవస్త్రం ధరించి కొండుభొట్లు, నీళ్ళ కాగులోకి తన జుత్తు వదుల్తాడు. గావంచాతో తడిజుత్తు తుడుచు కుంటూ అంటాడు.)

కొండి : తల వెంట్రుకలకి శీతోష్ణాలు తెలియకుండా చేసిన భగవంతుడి ప్రజ్ఞ ఏమని పొగడనూ. లేకపోతే సీతకాలంలో తెల్లవారగట్లే చన్నీళ్లలో మునగడానికి మనిషా, మానా?

(వీభూతిబురిక గూట్లోంచి తీసి బాలరామాయణం చదువుతూ నుదుటికి జెబ్బలకీ గుండెకీ రాసుకొంటాడు. )

కూజంతం... రామరామేతి..... మధురం మధు రాక్షరం ఆరుహ్యకవితాశా ఆఆఖాం| వందేవా...ల్మీకికోకిలం. యఃఎర్భ సతతం రామ....

చప్పుడౌతుంది. లేచాడు గాబోలు. (గట్టిగా)

చరితామృత సాగరం అతృప్తస్తం మునిం వందే ప్రాచేత సమకల్మషం! గోష్పదీకృత వారాసిం మశకీకృతరాక్షసం

(రామమూర్తి ప్రవేశించును)

అబ్బీ మేష్టరుల్లేచాడ్రా?

రామ్మూ: మేష్టరుగారు యేటికి స్నానానికెళ్ళారు.

కొండి : యీచల్లో యేట్లో యలా స్నానం చాస్తాడ్రా? ఉద్దండ పిండంలా వున్నాడు.

రామ్మూ : మీకంటే యెవరైనా నయం.

కొండి : తండ్రిం తప్పట్టకూడదు; తెలిసిందా. మాతృదేవోభవ! పితృదేవోభవ! అని వేదం ఘోషిస్తూంది.

రామ్మూ : రాత్రి ఎక్కడకెళ్లారు.

కొండి : పెద్దల్ని పిన్నలు ప్రశ్నలడగకూడదు. యాభై యేళ్ళు దాటి తుదకి నీకా నేను సమాధానం చెప్పడం! నా బ్రతుకు అంతకొచ్చిందీ!

అంజనానందనం దేవం జానకీ శోకనాశనం!
కపీశ మక్షహంతారం వందే లంకాభయంకరం!

గురుజాడలు

473

కొండుభొట్టీయము