పుట:Gurujadalu.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 రణ : (నిస్పృహను సూచించి, విచార రసము కల నవ్వునవ్వి) వాఙ్మాధురిని మీరిన రూపసౌందర్యము ఆమెకు కలదు.

బిల్హ : కుమారా మీరెలా చూస్తిరి.

రణ : ఒకమారు మదనపాలుల కుమార్తె చంద్రలేఖా, మహారాజ పుత్రికయును యీ వనము చూచుటకు వచ్చియుండిరి. నేను వారి రాక చూచి ఒక కుంజమున దాగుంటిని. చెలికత్తెలు పొదనుండి పొదకు వేటాడి పట్టుకుని ఆమె యెదుట వుంచిరి. ఆమె తమ తల్లిగారికి నన్ను కనపర్చినారు. వారు కూడా దయ కనపర్చినారు. అప్పటినుండి కమలములు కోసి తీసుక పోనాజ్ఞ అయేను. అట్లు నెల రోజులు తీసుకు వెళ్ళితిని. మాధవశర్మగారు దగ్గర వుండగా నేను వెళ్ళుట కలదు. ఆమె పాఠములు చదువునప్పుడు దగ్గర వుండేవాడను. శ్లోకములు రచించేవాళ్ళము. ఇలా నెల రోజులు అయిన తరువాత మా తాతగారు వద్దన్నారు. మరి నేను వెళ్ళలేదు. యీ వనంలో వారు విహరించడం తరచు కద్దు. అట్టి సమయంలో నేను యీ యింట్లో వచ్చి దాగొనమని ఆజ్ఞ.

బిల్హ : ఆమె పెద్దపులి కారే? నాకు బోధపడ్డది. మీ మనస్సు ఆమె యందు లగ్నమాయెను కాబోలు. యిప్పటి అవస్థనుబట్టి మీ ప్రేమను రాజకుటుంబము వారు నిరాకరించిన అవమానము వచ్చునని కాబోలు.


***

గురుజాడలు

460

బిల్హణీయము