పుట:Gurujadalu.pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు



“సామన్త మౌళి మణీ రజ్ఞిత పాదపీఠ,
మేకాత పత్ర నవనేర్నతథా ప్రభుత్వమ్
అస్యా స్సఖే చరణయో రహ మద్య కాస్త
మాజ్ఞాకరత్వ మవిలంఘ్య యథాకృతార్థ?”

ప్రియురాలి ఆజ్ఞకు చక్రవర్తులు బద్దులు, ఇతరుల మాట చెప్పనేలా.

రణ : అహ యేమి శ్లోకం గురోజీ!

బిల్హ : కుమార, ఇది వినండి.

వాత్సల్యం నవహత్య పత్యవిషయే వ్యాక్షిష్యతే న క్షణం
దాక్షిణ్యేన సమీహితే నవవధూ వర్గేపి ధీరాశయః
నిష్ణాతః కుటిలే నయాధ్వని చరన్నాచారపూతః ప్రభో
దుస్సాధ్యానపి సాధయ త్యభిమతా నర్థాన్సుసాధ్యానపిః11

రణ : మహామాత్య సంపత్కరుడు మీవంటి మహాకవివల్ల కృతి పొందడం; యేమి అదృష్టవంతుడు. మనకు ఆప్తుడు తమ పొగడ్తకు తగినవాడే గాని జైనుడు కాకుండావుంటే బాగుండును.

బిల్హ : (చిరునవ్వు నవ్వి) కుమార! నిజమైన జ్ఞానమును సాధించవలెనన్న పండితుడికి పరమతముల యెడల అసూయ వుండకూడదు. ఈ భూ ప్రపంచమందు లెక్కలేని మతాలు వున్నవి. అన్ని మతాలలోను ప్రతిభావంతులు, మహాపండితులూ కలరు. మన మతమే నిజమూ, పర మతములన్నీ అబద్దమూ అనుట అజ్ఞత. ఏ దేశంలో, యే మతంలో, యేమేమి మేలు వుంటే అదల్లా గ్రహించదగినదే. నాలుగు దేశాలూ తిరిగి నాలుగు మతాల వాళ్ళతోనూ అన్నతమ్ముల్లాగ బతికిన వాళ్ళకి మతాభిమానాలు మాసిపోతాయి. బుద్ధికి సంకెళ్ళు విడిపోతాయి. వైదిక మతావలంబియై రోజూ రెండు ఝాములు మఠంవేసి జపతపాలు చేసే నానామంత్రి ప్రవర్తనకు, జైనుడై వేదబాహ్యుడైన సంపత్కరుడి ప్రవర్తనకు కల భేదము చూస్తిరి కదా! నానామంత్రి తనకు తెలుసునని గర్వించే ఆ భగవద్గీతలోనే తొమ్మిదవ అధ్యాయంలో దేవప్రకృతి, రాక్షస ప్రకృతి వర్ణింపబడియున్నవి. అందులో వైదికుడైన నానామంత్రియందు ఆదిరాక్షస గుణములు మూర్తీభవించి వున్నవి. జైనుడైన సంపత్కుమారుడి యందు దేవగుణాలు వున్నవి. గీతలోకల్లా విలవైన శ్లోకాలు ఆ అధ్యాయంలో వున్నాయి. అవి మనసును పట్టినవాడు తన్నూ లోకాన్ని కూడా జయిస్తాడు.

గురుజాడలు

457

బిల్హణీయము