పుట:Gurujadalu.pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 నానా : కూచోండి, చెబుతాను (శిష్యుడితో) అబ్బాయీ, మీరు కొంతసేపు అవతలకు వెళ్ళి చదువుకోండి, చదువు వంటి వస్తువ లేదు.

(శిష్యునికి వెళ్ళమని గురువు సంజ్ఞ చేయును. శిష్యుడు వెళ్ళును. నారాయణభట్టు నానామంత్రి కూచుందురు. )

నానా : విన్నారా, కలశ మహారాజు వొక వేశ్యను వుంచారు. ఆ వేశ్య మీద బిల్హణుడు ఒక ప్రబంధం చెప్పగా, కలశ మహారాజు సంతోషించి బిల్హణుడికి ఆ వేశ్య దగ్గిర ప్రవేశం కలుగజేశారు. యీ రాజులకి దయపుడితే, చెయ్యతగిన మర్యాదా, చెయ్యదగని మర్యాదా, కానరు. ఆ పైని జరగవలసిన పని ఏదో, జరిగింది. దాంతో యీ తుంటరి కవికి ఉద్వాసన అయింది..

నారా : యింత విద్వాంసుడు గదా, అలా జరిగి వుంటుందండీ? పండితుడన్నవాడు క్షుద్రులవలె నీచవృత్తులకు దిగడు. కిట్టక ఎవరో యీ కథ కల్పించి వుంటారని నా మతం.

నానా : మీకు లోకం తెలియదు. అట్టి సంశయమే మీకుంటే, ఈ రంకు శ్లోకం చదీవి . నిజానిజాలు కనిపెట్టండి. దస్తూరీ యెవరిదో పోల్చారా?

(పత్రం వొకటి చేతికి యిచ్చును.)

నారా : యేమిటండిది? దస్తూరి బిల్హణులదే అనుకుంటాను. (చదువును)

‘అలమతిచపలత్వా త్స్వప్నమాయోపమత్వా
త్పరిణతి విరసత్వా త్సంగమేనాంగనాయాః |
ఇతి యది శతకృత్వస్తత్వమాలోచయామ
స్తదపిన హరిణాక్షీం విస్మరత్యంతరాత్మా ||

ఈకవిత్వమూ, శృంగారం అన్నవి, యేంతటి పండితుడికైనా, కళంకం తేకమానవు. అందుచాతనే మా తండ్రిగారు కవిత్వం చెప్పబోయేవు సుమా, చెడతావని శలవిచ్చేవారు. నే చెప్పిన శ్లోకం చింపేయ్యండి.

నానా : యిది చింపవలసిన శ్లోకం కాదు. మహారాణీవారికి చూపిస్తాను. బిల్హణుణ్ణి కొట్ట గలిగినపాటి కవి, మన ఆస్థానంలో వొకరంటూ వున్నారు గదా, అని వారు యెంతో సంతోషిస్తారు. ఈ మూలంగా మీపైని మహారాణీ వారికి కలిగిన ఆగ్రహం కొంత మళ్ళ గలదు.

గురుజాడలు

449

బిల్హణీయము