పుట:Gurujadalu.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 శిష్యు : బాగానే వుందండి.

నారా : మహా, మహా, అనాలి. వొట్టి బాగుండడం కాదు. మహా బాగుందను. మొట్టమొదటికే తాళంపట్టాం అనగా, శంకకే శంక తగిలించావఁన్న మాట! యీ పద్యం చూస్తే రాజు డంగైపోతాడు. వోమూల శశాంకుడని తానే అంటూ యింకా అంకవఁన్నది యేమిటీ, అని యెంత బుద్దీ తక్కువ మనిషైనా అడుగుతాడా?

శిష్యు : (నవ్వు ఆపుకుంటూ) యెవ్వడూ అడగడండి, ఉత్తరార్ధం శలవియ్యరా?

నారా : ఇంకా ఉత్తరార్థం కూడా వుందిట్రా! యేమి సాధనం; చెప్పవలసిన అభిప్రాయం అంతా చెప్పేశాం గదా?

శిష్యు : 'శంకర', అనే మరోమాట తీసుకుని శంకరుడి సిరస్సు మీద చంద్రుడు వున్నాడు గనుక యేదైనా వొహ కల్పన యెత్తితే సరండి.

నారా : అసలు శంకనే, కొట్టిపారేశిం తరువాత, మరి కల్పనకి జాగా వొకటి వుంచావాఁ? ఇక తోవ కనపడదే... కనపడదే... హాఁ! దొరికింది రాయి!

(నారాయణభట్టు చెప్పును. శిష్యుడు రాయును. )

“అంకం కిమితి శశాంకే!
కదాపి నౄణాం నజాయతే శంకా”

శశాంకుడిలో అంకం యేమిటి? అనే శంక నరులకు ఎన్నడూ కలుగ నేరదు...

నారా : ప్రశస్తతరంగా వొచ్చిందిరా? యేమంటావ్?

శిష్యు : (నవ్వు ఆచుకొనను, ముఖం పక్కకు తిప్పి) ఔనండి.

నానా : అట్టి శంక యెన్నడూ పుట్టనేరదనీ ప్రథమార్ధంలో ప్రశ్నకు సమాధానం మా బాగా కుదిరిందిరా. ఏది పద్యం కలిపి చదువూ.

శిష్యు : (శిష్యుడు చదువును)

“అంకం కిమితి శశాంకే
కథమిహ నౄణాం విజాయతే శంకా11"

నారా : తగలేశావురా! బంగారంలాంటి పద్యం! కొంచెం రాగ వరస పెట్టి యాడవరాదూ!

శిష్యు : (రాగవరసతో) అంకం కీమితి శశాంకే! ఆ పైని చదవజాలక వీరగబడి నవ్వును. )

నారా : యెందుకు నవ్వుతావు? ఓరిపాడగట్టా! పద్యం బాగుంది కాదంటావా యేమిటి? | (నానా మంత్రి ప్రవేశించును) వూరుకో! వూరుకో! నానా మంత్రాస్తున్నారు, ఆ పత్రం దాచెయ్యి, (గురుశిష్యులు నిలుతురు).

గురుజాడలు

447

బిల్హణీయము