పుట:Gurujadalu.pdf/490

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 (నగరునుంci ఆభరణ భూషితలగు స్త్రీలు బంగారు పళ్ళెరములో సంక్రందన తాంబూలములూ పచ్చలహారమూ తెచ్చి నమస్కరింci బిల్హణునికి సమర్పింతురు. )

ఒకతె : అమ్మాజీ మహారాణీవారు తాము వారికి అంకితముగా రచించిన గీతమునకు సంతోషించి వారు ధరించే ఈ పచ్చల హారము తమకు దయ చేయించిరి. ధరించి సముఖమునకు రండి. (బిల్టణుడితో నిష్క్రమింతురు.)

నానా : (రామశాస్త్రులు, మాధవశర్మ ఉన్నచోటికి వచ్చి వారలతో) ప్రభువులు ఒక మాట మీదను నిలచివుండరు.

మాధవ : శకం తిరిగింది.

రామ : చక్రం యెప్పుడూ తిరుగుతూనే వుంటుంది. మరో, తిరుగులో, మీదు కిందికి దిగుతుంది, విచారమేలా?

(తెర దించవలెను)

బిల్హణీయము

రెండవయంకము

నారాయణభట్టు యింటి సావిడి.

(నారాయణభట్టూ, శిష్యుడు వామనశర్మ, ప్రవేశింతురు. )

నారా : అరవైయేళ్లు దాటి, యిప్పుడు కవిత్వం నేర్చుకోవాలంటే, యెలా సాధ్యమౌతుంది. రాజుకు కవిత్వం పిచ్చి, ఘట్టిగా పట్టుకుంది.... ఈ కవిత్వవఁన్నదానికి, వొక తోవా, తెన్నూ, సవబూ, సందర్బవూఁ, కానరాదు. యేదీ బిల్హణుడు చెప్పిన పద్యంలో మొదటి వాక్యం చదువూ.

శిష్యు : (చదువును) “అంకం కేపీ శశంకిరే జలనిధేః పంకం”

చంద్రుళ్లో, కళంకమును, కొంతమంది, సముద్రంలో బురదగా భావించారు.

నారా : కొంతమంది మనుష్యులు, చంద్రుళ్లో వుండుకున్నఘువంటి మచ్చయేదైతే వున్నదో దాన్ని సముద్రపు బురద అనుకున్నారని కదూ, కవి అభిప్రాయం? యే వెఱ్ఱివాడైనా, యెన్నడైనా, అలా అనుకుంటాడ్రా? బిల్హణుడు మహాపండితుడే గాని, కవిత్వంలో దిగగానే, అసత్యం కల్పించాడు. యేవఁంటావ్?

గురుజాడలు

445

బిల్హణీయము