పుట:Gurujadalu.pdf/488

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 నానా : (రామశాస్త్రితో) అస్త్రం అడ్డుదిరిగిందండీ.

రామశాస్త్రి :తాము కొంచం అతి ఆచరిస్తారు.

నానామంత్రి : యేం చేయను శాస్తులుగారూ? భగవంతుడు తీక్షణమైన బుద్దిని యిచ్చాడు. | అది విడడ్డదంటే, పట్టడానికి నాకే అసాధ్యమైపోతుంది. యిహ వూరుకుందునా?

రాము : తాము ఊరుకుంటే యేలాగ? బిల్హణుడు కుమారికావారి దగ్గర ఆనుకున్నాడంటే వారిని కలశ మహారాజుకు వివాహం చేసే ప్రక్రియ నడిపిస్తాడు. ధారాపతినిగూర్చి మనం ఇన్నాళ్ళాయి చేశిన ప్రయత్నం విఫలమౌతుంది.

నానా : చూశారా మొన్న కాశ్మీరరాజు తండ్రి అనంతభూపాలుణ్ణి, రాజు యెదుట భట్టువాళ్లా యెలా పొగిడాడో!

రామ : దానికి ప్రతిక్రియ అమ్మాజీవారి దగ్గర తాము కల్పించాలి.

నానా : రాజు అసాధ్యుడుగద!

(బిల్టణుడు నానామంత్రి వద్దకు వచ్చును. )

బిల్హ : (నానామంత్రితో) తాము పంపిన ద్రాక్షఫలముల వంటి ఫలములు మా దేశం విడిచిన తరవాత తినలేదు. పంపిన మీ దయకు చాలా సంతోషించాను.

కృష్ణ : (ఒకపాటి మెల్లగా, గాని వినబడేటట్టు) ముడ్డి కాల్చి, మూతికి వెన్న రాసేవాడు, యింతవాడు మరి పుట్టబోడు. )

నానా : (బిల్హణుని దూరము కొనిపోయి) పండితులలో యెంత ఓర్వలేని వాళ్లయినా వుంటారు. వీళ్ల నెవ్వరినీ నమ్మకండి. అందులో మాధవశర్మ బహుదుర్మార్గుఁడు. యామినీ దేవికి మీరు విద్య చెప్పబోతారని, ముక్కంటా నోటంటా యేడుస్తున్నాడు, ఎప్పుడో మీమీద నిందయేదో తీసుకొస్తాడు జాగ్రతమీద వుండండి.

(బిల్హణుడు తన మొలలో నున్న ఛురికను చూపించును)

నానా : మా నాయనగారికీ మీ నాయనగారికీ చాలా స్నేహం ఉండేది. తమకు తెలిసిందో లేదో మా తండ్రిగారు జ్యేష్ఠకలశుల గుణవర్ణన తరుచుగా చేస్తూవుండేవారు. వారు రెండు పర్యాయములు కాశ్మీరాస్థానముకు రాయబారిగా వెళ్లారు. అప్పట్లో వారు తెచ్చినదే మా తోటలోని ద్రాక్ష

బిల్హా : ఆలా చెప్పండి. అందుచేతనే ఆ స్వాదు కలిగింది.

గురుజాడలు

443

బిల్హణీయము