పుట:Gurujadalu.pdf/486

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 నానామంత్రి : అలా అనేటట్టయితే, యిప్పుడు ఆయన్ని పిలిపించండి. యీ ఆస్థానమందు రుజు విప్పిస్తాను.

విదూ : అదుగో, నారాయణభట్టుతో కలశి ఆయనే వస్తున్నారు. మీరు తలచేటప్పటికి బిల్హణుడు ఆకాశాన్నించి వుట్టిపడ్డట్టుంది. కాయసిద్దుంది కాబోలు.

(నానామంత్రి వెనుకవైపు నిర్ఘాంతపోయి చూచును. అలా చూచుచుండగా కర్ణమహారాజు స్వర్ణపేటికలోని రుద్రాక్షమాల దీసి ధరించును.)

నానామంత్రి : వైదికులు హద్దుమీద వుండరు. ఉచ్చాటనా శాసనమైనప్పటికీ యెలా తోసుకు వస్తున్నాడో! (ఉత్సాహముతో) అదిగో, నారాయణభట్టుగారి మెడలో రుద్రాక్షమాల!

విదూ : ఆచిత్రవేఁంజూస్తారు, ఈచిత్రం చూడండి. యిదుగో ప్రభువుల మెడలో ప్రభువుల రుద్రాక్షమాల!

(నానామంత్రి ఆశ్చర్యముతో మహారాజు వైపు చూసి, తిరిగీ నారాయణభట్టు కంఠమును పరికించుచున్న సమయములో బిల్హణుడు దగ్గిర కాగానే మహారాజు నిలుచుండును. అందరూ నిలుతురు. అది చూచి యెందుకో పోల్చుకోలేక, నానామంత్రి కూడా నిలుచును.)

కేశ : బోధపడ్డది “యీ హారము రాజుపండితుడైన కర్జమహారాజు కంఠమును అలంకరించినది” అని బిల్హణకవులు అన్నప్పుడు దాహలా ధీశుడగు కర్ణుని ఉద్దేశించి చెప్పివుందురు. కానలేకపోతిమి.

విదూ : యింతసేపటికి తర్కం పని చేసింది.

కృష్ణస్వామి : అదిటండీ. అషైతే మనమందరమూ బిల్హణులకు అపరాధం చెప్పుకోవలసి వుంటుంది.

కేశ : చుక్కానికి న్యాయంగా పోతుందీ స్వామివారి మనస్సు. కలుషం లేదు.

కృష్ణ : పండితుడికి కలుషంవుంటే, మరి పండితుడేవిఁటండీ. ఆ మహారాజును చూసైనా నేర్చుకోవద్దా?

కర్ణ : (బిల్హణ నారాయణభట్టులతో) దయ చెయ్యండి. దగ్గరగా కూచోండి.

(అందరును యవరి స్థలములయందు వారు కూచుందురు)

నానామంత్రి : (మాధవశర్మ చెవిలో) నా మాటలు గానీ వినివుండరు గద?

విదూ : అప్పుడు చాలా దూరంగా వున్నారు; విని వుండరు, కర్ణ పిశాచి వుంటే తప్పు.

గురుజాడలు

441

బిల్హణీయము