పుట:Gurujadalu.pdf/480

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నానా : ఉచ్చాటన చెయ్యడమున్నూ, అతనివద్ద నున్న ధనము తీసికొని, ధర్మవినియోగము చెయ్యడమున్నూ ఉచితమనీ తలుస్తాను.

కేశవ : క్షమాపణనుకోరి, విన్నవిస్తును. మహారాజాధిరాజా! పండితుడు శిక్షార్హుడుకాడు. “విద్వద్దండమగౌరవమ్”. అదిగాక నేరమన్నది ఒకటి స్థాపించవలసి :-

కర్ణ : (కొంచెము కోపరసంగా) నేరం లేదనా మీ అభిప్రాయము?

కేశవ : చిత్తం, చిత్తం, నేను యేమి మనవి చెయ్యగలను.

మాధవ : నేరవేఁ కాకపోతే యెన్నడూ కోపవెఁరగని ప్రభువులకు కోపమెందుకు వచ్చేని?

రామ : (మాధవశర్మతో మెల్లగా) ఊరుకొండి.

కర్ణ : మంత్రివర్య, యీ బ్రాహ్మణ్ణి అరవై గడియల్లోగా పట్ణోంలోనుంచి సాగనంపితే?

నానా : చిత్తం! యేలికల శాసనము ఈ క్షణమందే అమలు చేస్తాను. (పత్రిక వ్రాసి పంపును)

కర్ణ : మంత్రివర్య, మహారాజ కుమారికావారి విద్యాభ్యాసము విషయమై, మీ అభిప్రాయ మెట్టిది? మీరు అనుభవ శాలులు, సాంప్రదాయజ్ఞులు.

నానామంత్రి : మాతా మహారాణీవారి శలవు ఆ ప్రకారం అయినది. నేను యేమీ మనవి చెయ్యగలను?

కర్ణమహా : సంగీత సాహిత్యములూ, కొంత వరకు తర్క వ్యాకరణములూ, బావాజీ వారు చెప్పించారు. అదంతా మాధవశర్మగారి ఆశీర్వచన ఫలం గానీ, యీ విద్యలు జ్ఞాన సాధనములు. ప్రత్యేకం వీటియందు విలువ తక్కువ. భగవద్గీతను ఉపదేశించి మరీ విద్యాభ్యాసము విరమించడము ఉచితమని యిదీవరకు అనుకుని వుంటిమీ.

నానామంత్రి : ఏలికల వాక్యములు గురూపదేశములు. విద్య అనగా ముక్తి సాధనమైన విద్యే. సందేహ మేవిఁటి మహాప్రభో!

కర్ణ : మహారాజ కుమారికలు భగవద్గీతను పఠించతగ్గదనే మీ అభిప్రాయమా?

నానా : చిత్తము. నా చిన్నతనంలో మా తల్లిగారు పఠిస్తూ వుండగా నాకు కూడా గీతా శ్లోకములు కంఠోపాఠంగా వచ్చినవి. ప్రాజ్ఞుడనైన తరువాత వారణాసిలో గురు ముఖతః గీత ఉపదేశం అయినాను. దక్షిణయాత్రలు వెళ్లినప్పుడు కాంచీపురంలో లక్ష్మణాచార్యుల వారివద్ద కూడా గీతార్థం విన్నాను. నేను అజ్ఞుడనే గాని, నేను మనవి చేశిన స్వారస్యాలు వారు చిత్తగించి, ఆశ్చర్యపడేవారు. అది అల్లా అమ్మాజీ మహారాణీవారి శిక్షా ప్రభావం, మహాప్రభో.

కర్ణ : సందేహమేమి? సముద్రమునకైనా మేరకద్దుగాని, మనిషి బుద్దికి మేరయెక్కడిదీ? వాఖ్యాన కర్తలూ, మనవంటి మనుష్యులేనా? గురువు బుద్దికి పై ఆడవలెనని శిష్యుడు

గురుజాడలు

435

బిల్హణీయము