పుట:Gurujadalu.pdf/454

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌజ : వాడు బతుకుతున్న వాడికి అపకారం చెయ్యడం పాపానికి కారణం. గనుక మా అన్నయ్యని యెంత కష్టపడి అయినా నేను కాపాడడం విధి అని యెరుగుదునండి. (కొత్తగా వచ్చిన మనిషితో) యెవరు మీరు? కొత్త మనిషి : జరూరు ప్రయోజనం కలిగి వచ్చానండి. వర్తమానం చేయకుండా వచ్చినందుకు క్షమించవలెను - కింద నౌఖర్లు కానరాలేదండి. సౌజ : రండి - కూచోండి. గిరీశ : (లేచి వెళ్ళి ఒక కుర్చీ తెచ్చి తన కుర్చీ పక్కను వేసి) దయచెయ్యండి. కొత్త మనిషి : (కూచోక) అక్కర్లేదు. సౌజ : కూచోండి (కొత్తమనిషి కూచొనును) తాము యెవరండి? కొత్త మనిషి : నేనెవరో మనవి చేయక తీరదా అండి? సౌజ : యే కారణం చేతనైనా పేరు చెప్పడం యిష్టం లేకపోతే, చెప్పనక్కర లేదండి. కొత్త మనిషి : నేవచ్చిన పనికి, నా పేరుతో పనిలేదండి. కొన్ని కారణములచేత నా పేరు చెప్పడముకు వీలు లేదండి. క్షమించవలెనని ప్రార్థన. గిరీ

షెక్స్పియర్ అన్నాడు కాడా అండి “వాట్సినె నేమ్?” అని.

దానిని నేను చిన్న గీత ముక్కగా తర్జుమా చేశానండి. “పేరులోన నేమి పెన్నిధియున్నది” మన శాస్త్రాల్లో కూడా యెవరి పేరు వారు గట్టిగా ఉచ్చరించితే పాపవడన్నారు. తమకు విశదమే. కొత్త మనిషి : మరివొకరితో అయితే కల్పించి మారు పేరు చెప్పుదును. తమచోట అబద్ధం ఆడజాలనండి. గిరీ : భోజరాజు ముఖం చూస్తే కవిత్వం పుట్టినట్టు, తమ ముఖం చూస్తే యెట్టి వాడికైనా నిజవేఁ నోటంట వొస్తుందండి. కొత్త : ఒకానొకరికి తప్ప. గిరీ “సచేమాన్ ఈజ్ టుబి పిటీడ్” అనగా అట్టి మనిషి వుంటే ఆ మనిషి యెడల మనం కనికరం కలుగజేసుకోవాలి - అంతే. సౌజ : అసత్యవఁనేది యెవరితోనూ ఆడకూడదు. కొత్త : మంచివారి యెడల మంచిగానూ, చెడ్డవారి యెడల చెడ్డగానూ, వుండమని మా తల్లిగారు ఉపదేశం చేశారు. అంచేత తమతో అబద్ధవాఁడనన్నాను. గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు . 409