పుట:Gurujadalu.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హెద్దు : వారు కనపడితే బాగుండును. అసిరి : అదేటి బాబూ, ఆరు నాకగుపడుతున్నారు! గవ

సిద్ధులూ, పిశాచాలు, మాలాంటి మాంత్రికులికి కనపడతారు. వాడిలాంటి మూఢ

భక్తులకు కనపడతారు; పాపం, పుణ్యం యరగని, పసిపిల్లలకి కనపడతారు. ఇతరులకు కనపడరు. గిరీశం: డామ్! హంబగ్. (కఱ్ఱతో గవరయ్య పక్కని ఖాళీ జాగా కొట్టి) యవడున్నాడిక్కడ? హెడ్డుగారూ? యిదంతా గ్రాండ్డచ్చీ ఆఫ్ బేడెన్.

నువ్వు రెండు ఇంగిలీషు ముక్కలు చదువుకుని నాస్తికుడివి కాగానే మాహాత్మ్మాలు

పోతాయనుకున్నావా యేవిఁటి? నువ్వు సొట్టకఱ్ఱ తిప్పితే సిద్ధులికి తగుల్తుందా? నీలాగే పెద్ద కబుర్లు చెప్పిన రిజిస్టరికి, స్మశానంలోకి తీసికెళ్లి దెయ్యాన్ని చూపించేసరికి, ఆర్నెల్లు వూష్టం పెట్టుకున్నాడు. సిద్ధుల్ని నిందిస్తే బుఱ్ఱ పగుల్తుంది. అసిరి : ఆరేటి బాబూ, బైరాగోరు! గిరీశం: (అసిరిగాడిపైని ఉరికి) వెధవా, యేడిరా? అసిరి : లేడు బాబూ, లేడు బాబూ, ఉత్తినన్నాను. గిరీశం: దొంగ గాడిద కొడకా! (హెడ్డుతో) మీరు సాక్ష్యం కుదుర్చుకోవడం మానేసి, ఈ గవరయ్య మాయలో పడితే మరి తేలారా? హెడ్డు : అన్నా - అలా అనకండి. వీరి సాయం వల్లే మనం వొడ్డెక్కాలి (చెవిలో) గవరయ్య గారు మనకి ముఖ్యమైన సాక్షి. గవర : కిరస్తానప భ్రష్టులు చేరినచోట మాంత్రికులూ, సిద్ధులూ వుండజనదు. - ( కాళీ వైపు చూసి) రండి గురోజీ మన తోవని మనం పోదాం. లుబా : గవరయ్యన్నా, యెక్కడికి వెళతారు? గవర : నాకు తోచిన చోటికి. లుబ్దా : మరి సాక్ష్యవోఁ? గవ అవధాన్లు గారు పెళ్లాడినది కామినీ పిశాచం. “అదీ మనిషీ, గోడగెంతి పారిపోయింది” అని నేను అబద్ధపు సాక్ష్యం చెప్పానంటే మరి మంత్రం అన్నది నాకు మళ్లీ పలుకు తుందా? నా వొంతు ఆ గిరీశాన్ని సాక్ష్యం పలకమను. నమ్మి చెడినవారు, లేరు! నమ్మక చెడిపోతే, పోయేరు || గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు

405