పుట:Gurujadalu.pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గిరీశం: మా వాడు, కావలసినవాళ్ళ సలహా వింటాడండీ? దత్తత చేసుకుంటానని యెన్నాళ్లాయో అంటున్నాడు; దత్తత చేసుకుంటే కనిపెట్టివుండనా? "పోనీ ఓ పవరాఫ్ టర్నామా అయినా నా పేర వ్రాయి, నీ వ్యవహారాలు చూస్తాను” అంటే, చెవిపెట్టడు. హెడ్డు : యేవఁండీ, అవుఁధాన్లుగారూ అలా చెయరాదటయ్యా? లుబై :

వెనకనుంచి ఆలోచించుకుందాం.

గిరీశం: అధాత్తుగా, జెయిలులోకి లాక్కుపోతే, ఆ పైని చేసే పనేవిఁటి? హెడ్డు : జయిలు సిద్ధపరిచారూ? గిరీశం: మాటవరసకన్నాను. కీడించి మేలించాలి. యినస్పెక్టరు కుట్ర బలంగా వుంది. పోలిశెట్టి సాక్ష్యం పలకనని సౌజన్యారావు పంతులుగారితో చెప్పి వూరికి వెళ్లిపోయినాడు. హెడ్డు : అయ్యో, మరేమిటి గతి? గిరీశం: అదే పంతులుగారూ, నేనూ విచారిస్తున్నాం. (పూజారి గవరయ్య ప్రవేశించును.) హెడ్డు : గవరయ్య గారూ, గురోజీ కనపడ్డారా?

యిదుగో నాతో వొస్తూంటేనే! మీ పెరటి అరుగు మీదే యింత సేపూ సమాధిలో

వున్నారు. హెడ్డు : నాకు పెరటి అరుగుమీద కనపడలేదే? పోనీండి ఆయనవొచ్చారంటే బతికాను అన్నమాట యేరీ? గవ

యేమి అలా అడు

రు? యిరుగో మీ యెదటా? ( కాళీ జాగావేపు చూపును) మీకు కనపడలేదా యేమిటి? (కాళీ జాగా వైపు చూసి) యేం గురోజీ తిరస్కరిణీ విద్య అవలంబించారేమిటి? - ఓహో, మీ గురువు గారి ఆజ్ఞ ఐందనా? -అయితే నాకెలా కనపడుతున్నారు? నాకు మంత్రసిద్ధి కలదనా? అయితే యెన్నాళ్లు యిలా కనపడకుండా వుంటారు? - ఒక్క పక్షవాఁ? - (హెడ్డుతో) అదీ వారు శలవిచ్చిన గవ - మాట. హెడ్డు : ఈ లోగా మా వీకకి వురి అయిపోతుందే? గవ : (కాళీ జాగా వైపు చూచి) యేమి శలవు. గురూ? - (హెడ్డుతో) మీకేమీ పర్వాలేదన్నారు. హెడ్డు : ఈ రాత్రి అంజనం వేయిస్తావఁన్నారు గదా, యెలాగ? (కాళీ వైపు చూచి) యేం శలవు? - (హెడ్డుతో) అన్ని పనులూ నా చేత చేయిస్తామన్నారు. కన్యాశుల్కము - మలికూర్పు గవ

గురుజాడలు 404