పుట:Gurujadalu.pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గిరీశం: (గద్గద స్వరంతో) సౌజన్యరావు పంతులు గారు చెప్పిన మాటలు చూస్తే, యీ గండం గడుస్తుందని నాకు ధైర్యం తాళకుండా వుంది. నీకు కావలసిన వాణ్ణి, చదువుకున్న వాట్లే, బుద్ధిమంతుణ్ణి గనక నీకు మంచి సలహా చెప్పమని సౌజన్యారావు పంతులు గారు నాతో మరీ మరీ చెప్పారు. లుబ్ధా : ఆయన్ని చూశావురా? గిరీశం: “చూశావా” అనా అడుగుతున్నారు? ఆయన దగ్గరికి పెద్ద సిఫార్సు తీసుకువొచ్చాను. ఆయనకి నా మీద పుత్ర ప్రేమ. ఆయనకేమీ పాలుపోకనే, నన్ను మీతోటీ, హెడ్డు కనీస్టీబు తోటీ మాట్లాడి, మంచి సలహా యిమ్మని పంపించారు. గనక నా మాట విను యెందుకైనా మంచిది, ఒక దత్తత పత్రిక రాయి - కన్న కొడుకు లేనందుకు, ఉత్తరగతి చూసుకోవాలా లేదా? లుబ్ధి : నాకువున్న బంధువులంతా నా దగ్గిర డబ్బు లాగాలని చూసేవారే గాని, నా కష్ట సుఖాలకి పనికివొచ్చేవాడు ఒక్కడయినా కనపడ్డు. గిరీశం: ఒహణెత్తినైనా యెన్నడైనా, ఓ దమ్మిడీ కొట్టిన పాపాన్ని పోయినావూ? నేనొక్కణే గద, నీ మీద అభిమానం పెట్టుకు దేవులాడుతున్నాను. మిగతా నీ బంధువులకి యెవరికైనా నీ మీద విసరంత అభిమానం వుందీ? చెప్పు. లుబా : లేకపోతే పీడా నాడా కూడా పాయెను. గిరీశం : నే మట్టుకు నీ దగ్గర ఒక్క దమ్మిడీ యెన్నడూ ఆశించలేదు. నీపరం కోసం దత్తత చేసుకోమన్నాను. నన్ను కాకపోతే మరొకణ్ణి చేసుకో. లుబా : యిహం యింత బాగా వెలిగింది; పరం మాట బతికివుంటే ముందు చూసుకుందాం. గిరీశం: సౌజన్యరావు పంతులు గారు నీకు మంచి సలహా యిమ్మని శలవిచ్చారు. గనక నీతో యీ మాట చెప్పాను; అంతేగాని, ఆప్తులు చెప్పిన మాట నువ్వు వినవన్న మాట నాకు బాగా తెలుసును-పోనియ్యి-రో మాట చెబుతాను. అది ఐనా, చెవిని బెట్టు - నీకొక వేళ, సిక్ష అయితే, నీ తరఫున, నీ వ్యవహారాలూ, సవహారాలూ చూడడానికి యవడైనా ఒకడు వుండాలా లేదా? నీ బంధువుల్లో కల్లా యంగిలీషు వొచ్చినవాణ్ణి, వ్యవహార జ్ఞానం కలవాణ్ణి నేను వొక్కడే గద? నాకో పవరాఫ్ ర్నామా గొలికి యిచ్చెయ్యి. లుబా : నువ్వెందుకు నన్ను దురంలో వున్నవాణ్ణి, మరింత దుర పెడతావు? అన్నిటికీ నాకు సౌజన్యారావు పంతులు గారు వొక్కరేవున్నారు. ఆయన యేలా చెబితే అలా చేస్తాను. గురుజాడలు 399 కన్యాశుల్కము - మలికూర్పు