పుట:Gurujadalu.pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాయడు : సౌజన్యారావు పంతులుగారు మహా దొడ్డ వారు. కోట్లలో యెన్నవలిసిన మనుషులు. ఆపదలో వున్న యెవరికైనా ఆయ్న ఉపకారం చెయ్యవలసినవారే? అగ్ని : అషైతే, వెధవముండని పెళ్లాడిన చావాటుపీనుగును వెనకేసుకుని, నా వీక యెందుకు నొక్కుచున్నాడు? - అడుగో ఆ గాడిదకొడుకు! (గిరీశం తొందరగా ప్రవేశించును. అగ్నిహోత్రావధాన్లు పక్కనుంచి గిరీశం మీదపడును. గిరీశం తప్పించుకుని కిందికి జారి, అగ్నిహోత్రావధాన్లు కాళ్లు బట్టి లాగి, “మావగారికి నమస్కారం” అని పరుగుచ్చుకొనును. అగ్నిహోత్రావధాన్లు కిందపడును) నాయడు : అల్లుడుగారా యేవిఁటండి? (లేవదీసి వొళ్లు దులుపును. ) అగ్ని : వీడి శ్రాద్ధం చెట్టుకింద బెట్టా! యేడీ, వెధవని చంపేస్తాను? నాయడు : అల్లుణ్ణి హతవాఁరిస్తే, కూతురు డబ్బిల్ వెధవౌతుంది. శాంతించండి. అగ్ని : నీ యింట కోడి గాల్చా! నాయడు : అమోఘాశీర్వచనము! పదండి. శివ స్థలము : లుబ్ధావధాన్లు బస లుబా : రామనామతారకం| భక్తిముక్తి దాయకం|| (గిరీశం ప్రవేశించి లుబ్ధావధాన్లును కాగలించుకొని “అన్నయ్యా” అని యేడ్చును.) లుబా : యిదేవిఁట్రా? లుబ్దా

గిరీశం: నీ మీద కూనీ కేసు వొచ్చిందని తెలిసి నిద్రాహారం లేకుండా యకాయకీని వొచ్చాను. మా అన్నయ్యకీ వాళ్లకీ కబురు పంపించావు కావేవిఁ? యెవడేం జెయ్యాలి? అన్నిటికీ సౌజన్యారావు పంతులుగారే వున్నారు. అయితే అబ్బీ, అగ్నిహోత్రావధాన్లు గాడి కూతీర్ని లేవదీసుకు పోయినావట్రా? వాడికి తగిన శాస్త్రి చేశావు. దాన్నిగానీ పెళ్లి మాత్రం ఆడలేదు గద? గిరీశం: నేనంత తెలివితక్కువ పని చేస్తాననుకున్నావా, అన్నయ్యా? నువ్వు నన్నేదో పెంచు కుంటావనీ, పెళ్లి చేస్తావనీ మా వాళ్లు కొండంత ఆశ పెట్టుకున్నారు గదా? లుబ్ధి : ఈ గండం గడిస్తే పెంపకం మాట ఆలోచించుకోవచ్చును. కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 398