పుట:Gurujadalu.pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌజ 3 వ స్థలము. సౌజన్యారావు పంతులుగారి కచేరీ గది (సౌజన్యారావు పంతులుగారూ, పోలిశెట్టి ప్రవేశింతురు)

చూశారా శెట్టిగారూ. యిప్పటి రోజుల్లో దేవ బ్రాహ్మణభక్తి కోమట్లలోనే వున్నది.

లుబ్ధావధాన్లుగారు బ్రాహ్మలు, వృద్ధులున్నూ - ఆయనను కాపాడితే మీకు చాలా సుకృతం వుంటుంది. పోలిశెట్టి: బాబు తమ శలవు కబ్బెంతర వేఁటి? సౌజ : చూశారా, మీరు సాక్ష్యం చెప్పి ఆయన్ని యీ ఆపదలోనుంచి తప్పించకపోతే, నిజం దాచినందువల్ల ఆయనకి యేమి ప్రమాదం వచ్చినా, ఆపాపం మిమ్మల్ని చుట్టు గుంటుంది.

పోలి అబ్బెంతరవేఁటి? బాబూ! సౌజ : నిజంగా కూనీ జరగలేదని మీనమ్మకవేఁకదూ? పోలి : అబ్బెంతరవేఁటి? బాబూ! సౌజ : ఆపిల్ల గోడదాటి పారిపోవడం మీరు చూశారుగదూ? పోలి : అబ్బెంతరవేఁటి బాబూ? సౌజ : మీరు అప్పుడు గుడ్డెమీదకి బాహ్యానికి వెళ్లివున్నారు? పోలి : అబ్బెంతరవేఁటి బాబూ? సౌజ : మీరు బాహ్యానికి వెళ్లినప్పుడు, సహాయానికి మీ నౌఖరును కూడా తీసుకు వెళ్లారు? పోలి : అబ్బెంతరవేఁటి బాబూ? సౌజ : (కలం కాగితం తీసి) యీ సంగతులే వ్రాస్తాను. చెప్పండి. పోలి : యేటి బాబూ? సౌజ : మీరు చెప్పబోయే సాక్ష్యానికి స్టేటుమెంటు కట్టుగుంటాను. జరిగినది అంతా చెప్పండి - వ్రాస్తాను. పోలి : మా యింట్లోళ్లకి ఉద్గాలవైఁన జబ్బుగా వుందని కబురెట్టారు బాబూ. నాకు సేతులు కాళ్లు ఆడకుండున్నాయి. బండీ కుదుర్చుకొచ్చాను - శలవిప్పించండి - యీ సాచ్చికాల్లో తిరిగితే పిల్లాపేకా బతుకుతారా బాబూ? గురుజాడలు 394 కన్యాశుల్కము - మలికూర్పు