పుట:Gurujadalu.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భీమా : (అగ్నిహోత్రావధాన్లుగారితో) ఏమిటయ్యా? అగ్ని : ఆయన పేరు గిరీశం, మరంతకంట నాకు తెలియదు.

చాబాష్, బాగా వుంది! అవధాన్లు గారి కొమార్తెని యెవడో తీసుకుపోయినాడు. కనక

వాడి వూరూ పేరూ యెరిగిన వాళ్లు తెలియచెయ్యవలసినదని, దండోరా కొట్టించి గేజట్లో వేయించండి. పోలీసు వారికి యెందుకు నోటీసివ్వలేదూ! సాకీనూ మొదలైనవి లేనిదీ కేస్ యడ్మిట్ చేయడానికి వీలులేదు. టిఫిన్ కి వేళయింది. లేదాము (అని లేచి వెళ్లిపోవును). అగ్నిహో: (భీమారావు పంతులు గారితో) ఏమండోయ్ కేసు అడ్డంగా తిరిగిందే? (భీమారావు పంతులుగారు మాట్లాడరు.) అగ్నిహో: యేమండోయి మీతోటి, మాట్లాడుతున్నాను. భీమా : ఇచ్చిన ఫీజుకు పనైపోయింది; మళ్లీ ఫీజిస్తేనేకాని మాట్లాడేది లేదు. అగ్నిహో: యేంపనైంది అఘోరంపని? కలక్టరు చివాట్లు పెడుతూంటే ముంగిలా మాట్లాడక వూరుకున్నావు! భీమా : బంట్రోత్! యితన్ని నా దగ్గరికి రాకుండా గెంటేయ్. అగ్నిహో: ఓహూ బాగుంది వ్యవహారం! రామప్పంతులేడీ? నాయుడు: (మెల్లగా వెనుకనుండివచ్చి) పోర్జరీ మాటరాగానే నన్నసన్నంగా జారారు. యీపాటికి వారి వూరికి సగంతోవలో వుంటారు. అగ్ని : అయ్యో కొంపతీశాడే! నాయుడు: ఇంగ్లీషువకీలు సరదా తీరిందా? పోర్జరీకి తమక్కూడా మఠప్రవేశం అవుతుంది. అగ్ని : అయ్యో నీ యింట కోడికాల్చా. నాయుడు: రోజూ కాలుస్తూనే వుంటారు. (తెరదించవలెను.) గురుజాడలు 393 కన్యాశుల్కము - మలికూర్పు