పుట:Gurujadalu.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భీమా : (అగ్నిహోత్రావధాన్లుగారితో) అయితే యేడువు. (అగ్నిహోత్రావధాన్లు తెల్లపోయి చూచును.)

యేదీ జాతకం దాఖలు చెయ్యండీ.

(భీమారావు పంతులు దాఖలు చేయును. ) నాయుడు : కోర్టువారితో వక సంగతి మనవి చేసుకుంటాను. యీ జాతకం విశ్వామిత్రుడంత యోగ్యుడైన బ్రాహ్మడి చేత తయారు చెయ్యబడ్డది. అదుగో ఆ మూల నిలబడ్డ రామప్పంతులు గారికి యీ జాతకంలో మంచి ప్రవేశం వుందండి. భీమా : నేను పేడ్ వకీల్ని. కేసు హీరింగు నేనే చేయవలెను గాని, నాయుడు గారు చేస్తే నేనెంత మాత్రం వొప్పేది లేదు. నాయు: స్మాలెట్ దొరగారి దగ్గర్నుంచీ యేజన్సీ కోర్టులో వకాల్త్ చేస్తున్నాను. డబ్బుచ్చుకున్నందుకు నా పార్టీ తరఫున నాలుగు మాటలు చెప్పి తీరుతాను గాని, యింగ్లీష్ చదువుకున్న కొందరు వకీళ్లలాగ నోటంట మాట్రాకుండా కొయ్యలాగ నిలబడనండి. (అగ్నిహోత్రావధానుల వైపు జూచి) మీ కుమార్తె యే సంవత్సరమందు పుట్టిందయ్యా? అగ్ని : అంగీరస.

జాతకంలో భావవుందే? బ్రాహ్మణ్యం పరువంతా తీసేస్తిరే. గడ్డితిని పిల్ల నమ్ముకున్నావు సరే కాని, యీలాటి ఫోర్జరీలు కూడా చేయిస్తావూ? బ్రాహ్మల్లో వున్నంత ఖంగాళీ, మాలకూడూ మరెక్కడా లేదు. నీ దుర్మార్గత వల్ల నీ కుమార్తెను యీ అవస్థలోకి తెచ్చి మళ్లీ ఎడక్షన్ కేసు కూడానా? నీ పొట్ట కరిగించేస్తానుండు. (గుమాస్తాతో) కేసులో

నోటీస్టు చెయ్యి, గుమా : (ఛార్జీ కాగితము జూసి) యిందులో ముద్దాయీ యింటి పేరూ సాకీనూ లేదండి. నాయు: (లేచి) యీ అర్జి వల్లకాట్లో రామనాధాయ వ్యవహారం లాగుంది. ఇంగ్లీషు వకీళ్లు దాఖలు చేసే కాకితాలు యీరీతినే వుంటాయండి. భీమా : (గుమస్తాతో రహస్యముగా) తరవాయీలు నింపించలేదుటయ్యా? (పైకి) యీలా నాయుడుగారు నన్ను తూలనాడుతూంటే, కోర్టు వారు ఊరుకోవడం న్యాయం కాదు.

నాయుడు గారు మిమ్ము నేమీ అనేదే?

భీమా : (తనలో) యిక్కడికి నేను రావడం బుద్ధి పొరపాటు. క్లార్క్ : (భీమారావు పంతులు గారితో) ఇంటి పేరూ, సాకీనూ యేమిటండీ? గురుజాడలు 392 కన్యాశుల్కము - మలికూర్పు