పుట:Gurujadalu.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కలె : (కాగితమందుకొని) యేమిటయ్యా కేసు స్వభావం? భీమా : చిత్తం, యీయన వెధవ కొమార్తెని, యీయన కొమారుడికి చదువుచెప్పే గిరీశం అనే ఆయన అలంకారాలూ, ఆస్తీతో కూడా లేవతీసుకు వెళ్లిపోయినాడు. అగ్ని : దస్తావేజులూ, కోర్టు కాయితాలూ కూడానండి.

యేమిటి? ఆ, హా, హా, హా, హా, (నవ్వుచు బూట్సు నేలపై తట్టును) బలే శాబాష్

(అర్జీ చూసుకొని) యిన్నాళ్లేమి చేస్తున్నారు? భీమా : తహస్సీల్దార్ గారి దగ్గర నేరం జరిగిన మూడో రోజునే మున్సబు కోర్టు వకీలు వెంకట్రావు పంతులుగారు, ఛార్జీ దాఖలు చేస్తే ఆ తహస్సీల్ దారు గారు కేస్ స్వభావం యేమిటని అడిగినారు. ఎడషన్ అని వెంకట్రావు పంతులు గారు చెప్పేసరికి యింగ్లీషు రాకపోవడం చాత, తహసీల్దారు గారు ఆ మాట యెప్పుడూ విశ్లేదని చెప్పారు. తరవాత కేస్ స్వభావం తెలుగున చెప్తే యీలాటి నేరం మా జూరిస్ డిక్షన్లో జరగదు. తోవలో రోడ్డు మీద యేతాలూకా సరిహద్దులో యెత్తుకుపోయినాడో అని అర్జీ దాఖలు చేసుకున్నారు కారు. లుబ్ధావధాన్లు గారి కూనీ కేసు కామాప్ చేసిన తహసీల్దారు గారే యీయనండి. నాయుడు : ఇంగ్లీష్ రాకపోతేనే మండి? తహసీల్దారు గారు యెంత ప్రాజ్ఞులు. పూర్వపు యూరోపియన్ అధికార్లని యెంతమందిని మెప్పించారు! ఆయన లుబ్ధావధాన్లు గారి కేసు కామాప్ చేశారని భీమారావు పంతులు గారు అంటున్నారు. యింకా యిన్క్వైరీ అవుతూ వున్న కేసులో అలా అన్నందుకు యీయన పైని తహసీల్దారు గారు పరువునష్టం ఛార్జీ తేవడమునకు వీలు వున్నది. (భీమారావు వైపు జూచి) పిల్లకు పదహారు సంవత్సరములకు లోపు యీడని రుజువున్నదా? భీమా : జాతకం వుందండి. నాయుడు : కోర్టు వారు ఆ జాతకం దాఖలు చేసుకోవాలి. భీమా : యీ కేసులో ఆయన మాట్లాడుతూ వుంటే నే ఎంత మాత్రం వొప్పేది లేదు. నాయుడు : యీ కేసులో నాక్కూడా వకాలీనామా వుందండి. (అని దాఖలు చేయును) భీమా : (అగ్నిహోత్రావధాన్లుగారితో) ఏమయ్యా, యీయనక్కూడా వకాల్త్ యిచ్చావయ్యా. అగ్ని : మొదటా, రామప్పంతులు యీయన కిప్పించారు. . గురుజాడలు 391 కన్యాశుల్కము - మలికూర్పు