పుట:Gurujadalu.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కరట : అతిజరూరు పని వుంది. మధురవాణీ మరోమాటు వస్తాను (నిష్క్రమించుతూ) తలవాయ గొట్టింది. తెల్లవెంట్రుకలు లావయినాయి మనసు కొంచెం మళ్లించుకుందాం.

వస్థలము : సౌజన్యరావు పంతులు గారి యింట్లో కచేరీ గది (సౌజన్యారావు పంతులుగారు, అగ్నిహోత్రావధాన్లు ప్రవేశింతురు) సౌజ : ఇక మిమ్ములను జయించినవాడు లేడు. పిల్లల్ని అమ్ముకోవడం శిష్టాచారం అంటారండీ! అగ్ని : ఆహా, మా మేనత్తల్ని అందరినీ కూడా అమ్మారండి. వాళ్ళంతా పునిస్త్రీ చావే చచ్చారు. మా తండ్రి మేనత్తల్ని కూడా అమ్మడవేఁ జరిగిందష, యిప్పుడు యీ వెధవ యింగిలీషు చదువునుంచి ఆ పకీరువెధవ దాన్ని లేవదీసుకుపోయినాడు గాని, వైధవ్యం అనుభవించిన వాళ్లంతా పూర్వకాలంలో యెంత ప్రతిష్ఠగా బతికారు కారు? సౌజ : పసిపిల్లల్ని కాలం గడిచిన వాళ్లకి పెళ్లి చేస్తే వైధవ్యం రాక తప్పుతుందా? నింపాది చేసి కొంచెం యోచించండి. అగ్ని : తెలుఖం చాలకపోతే ప్రతివాళ్లకీ వస్తుందండి. చిన్నవాళ్లకిచ్చినా, పెద్దవాళ్లకిచ్చినా, రాసిన రాత యెవడైనా తప్పించగలడా? సౌజ : మీరు చదువుకున్నవారు గదా, ప్రారబ్ధమని పురుష ప్రయత్నం యే వ్యవహారంలో మానేశారు? కేసు, “విధికృతం; యలా వుంటే అలా అవుతుందని” వకీల్ని పెట్టడం మానేశారా? కన్యలని అమ్ముకోవడం శాస్త్ర దూష్యం కాదా? డబ్బుకి లోభించి పిల్లల్ని ముసల వాళ్లకి కట్టబెట్టి విధికృతం అనడం న్యాయవేఁనా? శలవియ్యండి. అగ్ని : యిప్పుడు మీ లౌక్యుల్లో వెయ్యేసి, రెండేసి వేలు, వరకట్నాలు పుచ్చుకుంచున్నారు కారండీ? గిరీశం గారు చెప్పినట్టు - వాడి పిండం పిల్లులికి పెట్టా! - మీలో ఆడపిల్లలికి యిన్ని తులాలు బంగారం పెట్టాలి, యిన్ని తులాలు వెండి బెట్టాలి అని నిర్నయించు కోవడం లేదా? అది మాత్రం కాదేం కన్యాశుల్కం? సౌజ : అలా చెయ్యడం నేను మంచిదన్నానా యేమిటండీ? “గిరిశం గారు చెప్పినట్టు” అని అన్నారేవిఁటి? అగ్ని : ఆ వెధవ పేరు నాయదట చెప్పకండి. సౌజ : కానీండి గాని - మీ రెండో పిల్లకి తగిన వరుణ్ణి చూసి పెళ్లిచెయ్యండి. యేం సుఖపడు తుందని ముసలివాళ్లకి యివ్వడం? శలవియ్యండీ. కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 383