పుట:Gurujadalu.pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శిష్యుడు :నేనేం తప్పుచేశాను? గురువు గారు చెప్పిన పని చేశాను. ఆ తప్పూ, వొప్పూ ఆయందే. మధు : యవరేమి చేసితిరో, నాకు తెలియదు గాని, మీ యిద్దరి కోసం హెడ్ కనిష్టీబు గాలిస్తున్నాడు. దొరకగానే మఠం ప్రవేశం చేస్తాడట. యీ మాట మట్టుకు నాకు రూఢిగా తెలుసును. శిష్యు : యిదేనా మీరునాకు చేస్తానన్న పెళ్లి? కరట : యేమైనా జట్టీ వస్తే, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వెయ్యనట్రా? మధు : వొస్తే జట్టీ గురుశిష్యులకు యిద్దరికీ వొక్క మారే వస్తుంది గాని, ఒకరికి రావడం ఒకరు అడ్డు పడటం అన్న మాట వుండబోదు. యెప్పుడైనా మీ యిద్దరి ప్రాణాలకీ నేను కనికరించి, అడ్డుపడాలి కాని, మరి యవడికీ సాధ్యం కాదనుకుంటాను. శిష్యు : మా గురువుగారి మాటకేం; ఆయన పెద్దవారు; యేవొఁచ్చినా సర్దుకోగలరు. నేను పాపం పుణ్యం యెరగని పసిపిల్లవాణ్ణి. నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డువేశావంటే, కీర్తి వుండిపోతుంది. మధు : నీ గురువుని వొదిలేసి నా దగ్గర శిష్యరికం చేస్తావా? శిష్యు :యిదిగో-యీ నిమిషం వొదిలేస్తాను( బుగ్గలు గాలితో పూరించి పిడికిళ్లతో తట్టి గురువుతో) మీ నేస్తం యీవేళతో సరి. మరి ఆడవేషం యీ జన్మంలో వెయ్యను. మధు : నాటకంలో కూడా వెయ్యవా? శిష్యు : మరి నాటకం గీటకం నాకొద్దు. మధు : నా దగ్గిర శిష్యరికం అంటే యేవేco జెయ్యాలో తెలుసునా? శిష్యు : నీళ్లు తోడుతాను, వంట చేస్తాను. బట్టలు వుతుకుతాను. గాని బ్రాహ్మణ్ణి గదా, కాళ్ళు పట్టమనవు గద? మధు : (విరగబడి నవ్వి) యిదా నీ గురువు దగ్గర చేసే శిష్యరికం? శిష్యు : మరిచిపోయినాను. చీడప్పొక్కులు కూడా గోకుతాను. మధు : (నవ్వి) పెంకా? శిష్యు : యే నౌఖరీ చెయ్యమంటే ఆ నౌఖరీ చేస్తాను. మధు : నన్ను ముద్దెట్టుకొమ్మన్నప్పుడల్లా ముద్దెట్టుకోవాలి. శిష్యు : ముద్దెట్టుకుంటాను. గురుజాడలు 375 కన్యాశుల్కము - మలికూర్పు