పుట:Gurujadalu.pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కరట : వాడి కంట పడ్డావంటే - శిష్యుడు : పడితే? కరట : మరేం లేదు. మధురవాణి కంటే మనకి యెరువు యివ్వడానికి వొప్పుకుంటే, ఆంజనేయస్వామికి పదిశేర్లు నెయ్యి దీపారాధన చేస్తాను. శిష్యుడు : కడుపులోకి వెళ్లవలసిన నెయ్యి కాల్చెయ్యడం నాకేవీఁ యిష్టం లేదు. అమృతగుండీ మొక్కుకొండి. కరట : హాస్యం చాలించు! బెడిసిగొడుతుంది. (నిష్క్రమింతురు) కవ స్థలము. మధురవాణి బసలో గది (మధురవాణి కుర్చీమీద కూచుని యుండును. కరటక శాస్తులు, శిష్యుడూ ప్రవేశింతురు. మధురవాణి నిలబడును). మధు : గురువుగారికి పదివేల దండాలు; శిష్యుడి కొక చిన్న ముద్దు (శిష్యుని ముద్దు బెట్టు కొనును) కరట : నీ పుణ్యం వుంటుంది. నా అల్లుణ్ణి చెడగొట్టకు. మధు : అల్లుడెవరు? కరట : మా పిల్లని యితగాడికి యిచ్చి, కన్యాదానం చేస్తాను. మధు : జెయిలు నుంచి వొచ్చిన తరువాత పెళ్లా? లేక, పెళ్లి చేసుకుని, మరీ మఠ ప్రవేశవా? శిష్యుడు : జయిలేవిఁటండోయి? కరట : వొట్టినే హాస్యానికంటూంది. మధు : పాపం ఆ పసిపిల్లవాడికి వున్న నిజస్థితి చెప్పండి. తన వాళ్లని వెళ్లి చూసైనా వస్తాడు. శిష్యుడు :(కరటకశాస్త్రితో) కొంపముంచారో? మధు : ముంచడం అంటే ఆలాగా యిలాగానా? కరట : నీ పుణ్యవుంటుంది. హాస్యం చాలించు. లేకపోతే కుఱ్ఱవాళ్లకి పెద్దలయందు భక్తి చెడుతుంది. గురుజాడలు 374 కన్యాశుల్కము - మలికూర్పు