పుట:Gurujadalu.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌజన్య : ఈ దౌల్బాజీని తీరిగీ యెందుకు రానిచ్చారూ? లుబై : పొమ్మంటే పోడు బాబూ. సౌజన్య: యే వొచ్చాడు? లుబ్ధా : యిన పికటరికీ డిప్ట్ కలకటరికీ లంచం యిమ్మంటాడు. సౌజన్య : డిప్ట్ కలక్టరు గారు లంచం పుచ్చుకోరు. ఆయన నాకు స్నేహితులు; నాకు తెలుసును. లంచాలు పంచాలూ మీరు యిచ్చినట్టయితే, మీ కేసులో నేను పని చెయ్యను. లుబా : తమశలవు తప్పి నడుస్తే చెప్పుచ్చుకు కొట్టండి. నాకు భగవంతుడిలాగ తమరు దొరికారు. “పాలను ముంచినామీరే, నీళ్లను ముంచినా మీరే” అని మిమ్మల్నే నమ్మి ఉన్నాను. సౌజన్య : మీరు నేరం చేయలేదని నాకు పూర్తి అయిన నమ్మకం వుంది. నిజం కనుక్కోడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను గాని ఆ గుంటూరి శాస్త్రుల్లు యవడో భేదించ లేకుండా వున్నాను. మీరు జ్ఞాపకం మీద చెప్పిన చహరా గుంటూరు వ్రాసి పంపించాను. అక్కడ అలాంటి మనిషి యవడూ లేడని జవాబు వొచ్చింది. లుబా : అదేం మాయో బాబూ! మీ సాయం వల్ల యీ గండం గడిచి, నా పిల్లా నేనూ యీ ఆపదలోంచి తేలితే, నా డబ్బంతా, మీ పాదాల దగ్గిర దాఖలు చేసి కాసీ పోతాను. సౌజన్య: మీ డబ్బు నాకక్కర లేదని మీతో మొదటే చెప్పాను. నే చెప్పిన మాటలు మీకు నచ్చి, ముసలివాళ్లు పెళ్లాడకూడదనీ, కన్యాశుల్కం తప్పనీ, యిప్పటికైనా మీకు నమ్మకం కలిగితే, యిలాంటి దురాచారాలు మాన్పడానికి రాజమహేంద్రవరంలో వక సభ వుంది. ఆ సభకి కొంచవోఁ గొప్పో మీకు తోచిన డబ్బు యివ్వండి. వితంతువుల మఠానికి మీ పిల్లని పంపడం నా సలహా. లుబ్ధా : తమ చిత్తం, తమ శలవు. చేసిన తప్పులు, తప్పులని శల్యాల్ని పట్టిపోయింది. బుద్ధి వొచ్చింది బాబూ. సౌజన్య: ఆ గుంటూరు శాస్త్రుల్లుకి పరవఁట దేశపు యాస వుండేదా? బాగా జ్ఞాపకం చేసుకు చెప్పండి. లుబ్దా : (ఆలోచించి) లేదండి. సౌజన్య: బాగా జ్ఞాపకం తెచ్చుకోండీ. లుద్దా : లేదండి. (తెర దించవలెను) గురుజాడలు 372 కన్యాశుల్కము - మలికూర్పు