పుట:Gurujadalu.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ : మరి యేకొంపలూ తిరక్కపోతే కేసులు గెలవడం యలాగ? అదీ అందరు ముండల్లాంటిదీ అనుకున్నారా యేమిటి? సంసారి వంటిది. ఐనా మీకు రావడం ఇష్టం లేకపోతే నా చేతికివ్వండి, నేనే తాకట్టు పెట్టి సొమ్ము తీసుకువస్తాను. అగ్ని : అలాక్కాదు; నేను కూడా వస్తాను. రామ : యేదీ కడియం ఇలాగివ్వండి. అగ్ని : యిది మా తాతగార్నాటిది. యిది యివ్వడమంటే నాకేమీ యిష్టం లేకుండా వుంది. డబ్బు వూరికే ఖర్చు పెట్టించేస్తున్నారు; మీరు కుదిర్చిన వకీలు తగినవాడు కాడష్క యింగ్లీషూ రాదు, ఏమీ లేదూ. రామ : ఆయన్లాంటి చెయ్యి యీ జిల్లాలో లేదు. ఆయన్ని చూస్తే డిప్షికలక్టరు గారికి ప్రాణం. ఇంతకీ మీరేదో పట్టుదల మనుషులనుకున్నాను గాని, మొదటున్న వుత్సాహమ్మకు యిప్పుడు లేదు. మీకు డబ్బు ఖర్చు పెట్టడం యిష్టం లేకపోతే మానేపాయెను. “యావత్తైలం, తావద్వ్యాఖ్యానం” అన్నాడు. మరి నాకు శలవిప్పించెయ్యండి. అగ్ని : (ఆలోచించి) అయితే తాకట్టు పెట్టండి. (అని నిమ్మళముగా కడియము తీసి యిచ్చును) రామ : (తన చేత నెక్కించుచు) యీ కేసుల్లో యిలాగు శ్రమపడుతున్నాను కదా? నాకొక దమ్మిడీ అయినా యిచ్చారు కారు గదా? అగ్ని : అయితే నా కడియం వుడాయిస్తావా యేమిషి? రామ : నేను మీకు యెలాంటి వకీల్ని కుదిర్చాను! ఆయన మీ విషయమై యంత శ్రమ పడుతున్నాడు! ఇదుగో ఆయన వస్తున్నాడు. (నాయడు ప్రవేశించును) రామ : (తనలో) యేమిటి చెప్మా, వీడు మధురవాణి బస పెరటి దిడ్డీ వేపు నుంచి వస్తున్నాడు? వీడు కూడా మధురవాణిని మరిగాడా యేమిటి? వీణ్ణి ఈ కేసులో నుంచి తప్పించెయ్యాలి. నాయడు: యేమండీ రామప్పంతులన్నా, మిగతా ఫీజు యిప్పించారు కారు గదా? అగ్ని : మీరు రాసిన డిఫెన్సు బాగుందీ కాదని భుక్త గారన్నారష. నాయడు: ఎవడా అన్నవాడు? గుడ్లు పీకించేస్తాను. రామప్పంతులన్నగారూ చూశారండీ. డిఫెన్సు యెంత జాగ్రతగా తయార్ చేశానో. నా దగ్గిర హైకోర్టుక్కూడా ప్లయింట్లు రాసుకువెళ్లిపోతారు. యీ కుళ్లుకేసనగా యేపాటి? నేచెప్పినట్టల్లా పార్టీ నడిస్తే నేపట్టిన కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 368