పుట:Gurujadalu.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మీనాక్షి: యెప్పుడు తోలేస్తారు? రామ : యెప్పుడోనా? రేపే. లంజ యంత పతీవ్రత వేషం వేసిందీ! మీనాక్షి: మనవెఁప్పుడు వెళ్లిపోవడం? రామ : యక్కడికి? మీనాక్షి: మతిపోతూందా యేవిఁటి? రాజమేంద్రం? రామ : అవును. రేపు దాన్ని తోలేస్తానా? యెల్లుండి మనం వుడాయిద్దాం. గాని నీ సరుకులు తెచ్చుకుంటావా, ముసలాడికి వొదిలేస్తావా? మీనాక్షి: నాకున్నదల్లా నా సరుకులే; యెలా వొదిలేస్తాను? నా సరుకుల పెట్టె తాళం మా నాన్న దగ్గరుంది గదా, యేవి గతి? రామ : నా ప్రయోజకత్వం నీకేం తెలుసును? యిదుగో ఈ రింగున వున్న యినప ములికీతో నీచిత్తవొచ్చిన పెట్టె తాళం తీసేస్తాను. గాని నాకంటే యక్కడుంది? మీనాక్షి: గుంటకి పెట్టిందా? రాత్రివేళ, నా బట్టల పెట్లో పెట్టేది. రామ : నీ పుణ్యవుంటుంది. ఆ బట్టల పెట్టె వోమాటు తీసి చూతూ. రేపు దాని కంటే మధురవాణికిచ్చి, ముండని తగిలేస్తాను. మీనాక్షి: ఆ గుంట బట్టల పెట్టె తాళం పారేశింది? రామ : ములికితో తీసేస్తాను. మీనాక్షి: నా సరుకుల పెట్టె తాళం కూడా తీసేసి పెడతారూ? రామ : అద్దే! మీనాక్షి: నన్ను పెళ్లాడతానని ప్రేమాణం చేశారు కారే? రామ : దీపం అర్పేస్తే పెట్టె తియ్యడం యలాగ? మీనాక్షి: అగ్గిపుల్ల వుంది. రామ : ఐతే యిదిగో, నిన్ను తప్పకుండా పెళ్ళాడతానని ఈ దీపం ఆర్పేస్తున్నాను. (రామప్పంతులు దీపం ఆర్పి మీనాక్షిని కాగలించుకుని యెత్తును. ) రామ : యిలా యెత్తుకు తీసుకుపోతాను రాజమహేంద్రవరం. (లుబ్ధావధాన్లు చీకటిలో వచ్చి కఱ్ఱతో రామప్పంతులు కాళ్ల మీద కొట్టును. మీనాక్షి కిందపడును) గురుజాడలు 357 కన్యాశుల్కము - మలికూర్పు