పుట:Gurujadalu.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అసిరి : బాబు - మీనాక్షి: యవడు? రామ : అది వేరే కథ. మీనాక్షి: అసిరిగాడు కనిష్టిబు మాట యేం జెప్పాడు? రామ : మధురవాణి హెడ్డు మీద కుక్కని వుసిగలిపిందని చెప్పాడు. మీనాక్షి: యెందుకూ? రామ : నేను లేనప్పుడు వాడు యింట్లో చొరబడ బోతేను. మీనాక్షి: అయ్యో తెలివా! అసిరిగా! అసిరిగాడు : (ప్రవేశించి) యేటమ్మా! మీనాక్షి: వెధవా, నిజం చెప్పు. పంతులు యింట్లో లేనప్పుడల్లా కనిష్టబు మధురవాణితో వుంటాడని, నువ్వు నాతో చెప్పలేదూ? అసిరి : (బుజ్జగోకుకుంటూ) సెప్పినాను. రామ : దొంగ వెధవా! కుక్కని వుసిగలిపిందన్నావు? నౌకరోడు నోరుమూసుకోవొద్దా బాబు? సానమ్మడిగితే, మీమాట సెప్పుతాన బాబు?

వెధవా, నువు చెబితే నాకు భయవఁనుకున్నావా యేవిఁటి?

రామ : ఓరి అబద్ధపు వెధవా! యెవరితోనూ మా మాటమాత్రం చెప్పకు. రూపాయి యిచ్చాను కానూ? మీనాక్షి: యందుకిచ్చారూ, రూపాయి? అసిరి : పిల్లలోణ్ణిగందా? (పైకి వెళ్లును) రామ : దొంగముండ ద్రోహం చేస్తూందేం? మీనాక్షి: తెలుసునన్నారు? రామ : యింతని యెరగను. మీనాక్షి: ఆడది నీతి తప్పిన తరవాత అంతేవిఁటి? యింతేవిఁటి? తెగించిన దానికి సగుడు మొకాలుబంటి - అందులో సాంది ఖాయిదాగా వుండాలనుకోవడం మీదీ బుద్గీతక్కువ. రామ : బుద్ధి తక్కువంటే బుద్ధితక్కువా! ముండని బుజ్జి చితకపొడిచెయ్యాలని వుంది. దీనికింద యంత సొమ్ము తగలెట్టానూ! గురుజాడలు 356 కన్యాశుల్కము - మలికూర్పు