పుట:Gurujadalu.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ : కంటే పోయి యేడుస్తూ వుంటే, యీ వెధవ మూడు రూపాయలూ నా కెందుకూ? హెడ్డు : మీకు అబ్జర్లేకపోతే పోనియ్యండి. గురోజీ గారికి యిద్దాం. రామ : కొంచం చిల్లర ఖర్చుంది. యేం జెయ్యను? యిలా పారెయ్యండి. (పుచ్చుకొనును. ) హెడ్డు : గురోజీ తమకో తులసిదళం. బైరాగి : తృణం, కణం యేవొచ్చినా మఠానికే అర్పణం. హెడ్డు : (దుకాణదారుతోనూ, కనిష్టబుతోనూ) మీకో మూడు, నీకోమూడూ (చేతులు దులివి) సాఫ్ ఝాడా నాకు తిప్పటే మిగిలింది. దుకాణదారు : (బైరాగిని పక్కకి పిలిచి) యీవేళే చెన్నాపట్టం నుంచి ఫస్టురకం బ్రాందీ వొచ్చింది. చిత్తగించి మరీ కాశీ వెళుదురు గాని. హెడ్డు : గురోజీ! రాం! రాం! పంతులూ, ముసలాణ్ణి వెళ్లి పట్టుకోండి, భాయీ, స్టేషనుకు పోవాలి. (జవానుతో) రావోయి కావఁయ్యా. (హెడ్డూ, జవానూ, ఒకవైపున్నూ, దుకాణ దారూ, బైరాగీ మరి వక వైపున్నూ వెళ్లుదురు) రామ : కంటే పోయిందంటే మూడురూపాయలా చేతులో బెడతాడు! (విరసంగా నవ్వును) వీడి తాళం పడతాను. (హెడ్ పారేసిన కాకితపు ముక్కలు యేరి) యిన్పకటరుకి వొకటి, తాసిల్దారుకి వొకటి, ఆకాశరామన్న అర్జీలు పంపుతాను. వెధవ, మధురవాణి దగ్గరికి వెళతాడేమో? నేను యింటికిపోతే అరుగుమీద పడుకోవాలి గాని ఆ తిక్కలంజ తలుపుతియ్యదు. లుబ్ధావధాన్లు యింటికి వెళ్లితే వాడు కట్టుచ్చుకుంటాడు. యీ దేవాలయంలో పరుందునా? - పురుగూ బుట్రా కరిస్తే-కరిస్తే ఛీ! - యీ సానిముండని వొదిలేస్తాను - ఆ గుంట యావైఁనట్టు? నా అదృష్టం వల్ల యవళ్లింట్లో నైనా దాగి రేపు గాని కళ్లబడితే, కంటె పోకూడదు - ఒకవేళ చస్తే? - చచ్చుండదు-నూతులో పడలేదు. గవరయ్యా, కావఁయ్యా కూడా గాలించారు-ఒకవేళ అది రెండో పెళ్లి పిల్ల అయి, దాని ఆ తండ్రి కానికిగా వొచ్చి బండీ యెక్కించుకు దౌడాయించాడేమో? అలా ఐతే కంటే కూడా వుడాయించడా? -మీనాక్షిని పట్టుకుంటే కొంత ఆచోకీ తెలుస్తుంది అది కనపడ్డవెఁలాగ? తలుపు తట్టితే ముసలాడే వొస్తాడేమో? - (రోడ్డు దాటి లుబ్ధావధాన్లు యింటి గుమ్మం యదట నిలుచుని) ఆకలి దహించేస్తుంది - మీనాక్షి దొరికితే యేవైఁనా ఫలహారం యిచ్చును - యవడు చెప్మా! రావిచెట్టు కింద చుట్ట కాలుస్తున్నాడూ? (నాలుగు అడుగులు ముందుకు వెళ్లి) అసిరీ, నువ్వా? అసిరిగాడు : నానుబాబు (చుట్టపారవైచును) గురుజాడలు 352 కన్యాశుల్కము - మలికూర్పు