పుట:Gurujadalu.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బైరాగి : సాక్ష్యం అంటే మావంటి వాళ్లే చెప్పాలి. యోగదృష్టి వల్ల చూశావఁంటే యెక్కడ జరిగినదీ యెప్పుడు జరిగినదీ కళ్లకి కట్టినట్టు అప్పుడు కనబడుతుంది. గనక మేం కూడా వస్తాం. యెవైఁనా దొరికితే హరిద్వారంలో మఠానికి పనికొస్తుంది. రామ : జరిగినదాని ముండామోశిరి. కొంచం కల్పనుంటే కాని కథ నడవదు. అంచేత హెడ్డుగారు ముసలాడితో చెప్పే మాటలు నిజం అని మీరు శలవివ్వాలి. బైరాగి : వెట్టి! వెట్టి! నిజవేఁవిటి, అబద్ధవేఁవిఁటి! మేం సిద్ధులం. అబద్ధం నిజం చేస్తాం, నిజం అబద్ధం చేస్తాం - లోకవేఁ పెద్ద అబద్ధం, పదండి. (నిష్క్రమింతురు.)

1వ స్థలము : దేవాలయం గుమ్మం దగ్గర (హెడ్డు కనిష్టబు, రామప్పంతులూ మాట్లాడుతుందురు. మరివక కనిష్టీబు, బైరాగి, దుకాణదారు కొంత యడముగా నిలుచుందురు) హెడ్ : నా నౌఖరీ పోగొట్టుకుంటానా భాయీ? రామ : కొంచం బెదిరిస్తే నౌఖరీ పోతుందా అన్నా? పోలీసు డూటీ అంటే బెదిరింపే గదా? మీరు అలా తప్పించుకుంటే నేనేం అనుకోను? హెడ్డు : (చేతిలో నులుపుతున్న కాకితపు ముక్కలు విసిరేసి) భాయీ. లుబ్ధావుధాన్లు చంటి పిల్లడా? దుక్కిముచ్చా? బెదిరించడానికి కూనీ కేసని నాకేవైఁనా ఆశవుంటే, పోలీసువాణ్ణి, నేను వూరుకుంటానా? పట్టుకుంటే నాకు యెంత కారక్టు కాదు? యీ జవాన్ని యీ చీకటి రాత్రిలో నూతిలో దింపాను కానా? కూనీ గీనీ అంటే యవరైనా నవ్వుతారు. మీనాక్షి చేతికి వెరచి, ఆ పిల్ల యిరుగింట్లోనో పొరుగింట్లోనో పడుంది. మీ యింట్లోనే వుందేమో - ముసలాడు అన్నట్టు? రామ : దేవుఁడుతోడు మా యింటికి రాలేదు. యిరుగింటో, పొరుగింటో అని మీరు వూరుకుంటే యలాగ? మీ ధైర్యవేఁవిటో నాకు బోధపడదు. వెతికించవయ్యా అంటే, వెతికించారూ కారు. ఆ యిరుగింటి వాళ్లూ, పొరుగింటివాళ్లూ, పిల్ల నిద్దరపోతూవుండగా కంటే చెపాయిస్తే నాగతేవిఁటి? కంటె యింటికి పట్టుకు వెళ్లకపోతే మధురవాణి గుమ్మంలోంచి గెంటుతుంది. అనగా, గెంటుతుందని కాదు - యేడుస్తుంది - ప్రాణం తినేస్తుంది. విన్నారా? కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 350