పుట:Gurujadalu.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ : మీనాక్షి చావగొడితే పారిపోయింది. యెక్కడ వెతికినా కనపడలేదు. ముందు మీ జవాన్లని దౌడా యించండి. హెడ్ : యీ రాత్రివేళ మాజవాన్లు మాత్రం పట్టుకోగలా? పోలీసు జవానంటే పదికళ్లూ, పది కాళ్లూ వుంటాయనుకున్నావా యేవిఁటి? రామ : దాని సిగొసిరి; దాన్ని పట్టుకోవడం నాకెందుకు, నాకంటే నాకిప్పించెయ్యండి? హెడ్డు : యేవిఁటి నీ మాటలూ! ఆ కంటె పట్టుకు ఆ పిల్ల పరారీ అయిందని చెపితివి. నేను కంటె యెలా యిప్పిస్తాను? రామ : ముసలాణ్ణి అడిగితే, అది పట్టుకుపోయిందంటాడు; గాని నిజంగా వాడు పెట్టెలో దాచేశి యివ్వకుండా వున్నాడు. హెడ్డు : నన్నేం చెయ్యమంటావు? రామ : కూనీకేసని ముసలాణ్ణి బెదిరిస్తే, నా కంటే నాకిచ్చేస్తాడు; మీ చెయ్యి కూడా తడౌతుంది. హెడ్డు : అలాగనా-గానీ నువ్వన్నట్టు ఆ పిల్లగానీ, కంటె పట్టుకు పరారి అయిపోయి వుంటే- రామ : పోనీండి - దాని ఖరీదు యిప్పించెయ్యండి. హెడ్డు : వాడిస్తాడా? రామ : మరి మీ సాయం యెందుకు కోరాను? హెడ్డు : యిస్తాడని నాకు నమ్మకం లేదు. ఐనా చూస్తాను. కేసని యెత్తు యెత్తడానికి యిద్దరు ముగ్గురు సాక్షులుండాలి? రామ : మందిరంలో వున్నవాళ్లా? హెడ్ : వీరేశం, మనవాళ్లయ్యా, మూడోకాలంలో వున్నారు. హవల్దారు అబద్ధం ఆడమంటే తంతాడు. మునసబు నాయుడు యింతరాత్రివేళ అంతదూరం నడిచి రాలేడు. యిహ ఆడనూ పాడనూ రామందాసు వొక్కడే గదా? రామ : ఆ బైరాగాడు సాక్ష్యం పలకడేం? హెడ్డు : వేషం వేసుకు ముష్టత్తుకునే బైరాగాడనుకున్నావా యేవిఁటి? ఆయన గొప్ప సిద్ధుడు, నిలువెత్తు ధనం పోస్తే అబద్ధవాఁడ్డు. రామ : సాక్ష్యం పలకావొద్దు, యేవీ వొద్దు, దగ్గిర నిలబడితే చాలును. పిల్చుకురండి? (కనిష్టబు వెళ్లి దుకాణ దారునూ బైరాగినీ తీసుకువచ్చును. ) గురుజాడలు 349 కన్యాశుల్కము - మలికూర్పు