పుట:Gurujadalu.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దుకా : చూడగానే, నేను సిద్ధుల్ని పోలుస్తాను గురూ- మునస: సుక్కేసేవోళ్ళని మాబాగా పోలుస్తావు. మా వూరమ్మోరు జగజ్జనని ! మా చల్లని తల్లి. బైరాగి : బ్రహ్మోహం ! బ్రహ్మోహం! హెడ్డు : ఆహా! యోగమహత్యం! స్తానాల్చేసి, ముక్కు బిగించే బ్రాహ్మలకి లేవు గదా యీ సిద్ధులూ? బైరా : వేషానికీ - జ్ఞానానికి దూరం కాదా తమ్ముడా? మా తాతగారు చెప్పలేదా? “ఆత్మశుద్ధి లేని యాచార మదియేల” అని? హెడ్డు : వేమన్న - తమ తాతా, గురూ? బైరా : అవును - వారు పరంపదించి ఆరువొందల సంవత్సరాలు కావొచ్చింది. హెడ్డు : తమ వయస్సెంత గురూ? బైరాగీ : ఆదీ అంతూ లేనిదానికి లెఖేవిటి తమ్ముడా? పరమాత్మకెన్నేళ్లో అన్నేళ్లు. మునస: యేం యిలవైన మాటలింటున్నాం! (వీరేశ శంఖం పూరించును.) హెడ్డు : (శంఖం లాక్కొని పక్కనువుంచి) అట్టిపట్టెయ్యకండి భాయి. దుకా : అట్టే యక్కడ భాయీ? పరవశవైఁందాకా తాక్కుంటే తాగడవేఁటి? వేమన్న చెప్పలేదా? “తాగి, తాగి, తాగి, ధరణిపై బడుదాక తాగెనేని తన్ను, తాను తెలియు|| తాగలేని వాడె, తాగుబోతరయంగ యిశ్వదాభిరామ యనరవేమ|| బైరాగి : కాశీలో రెండువందల యాభై సంవత్సరముల క్రిందట అలంగీర్ పాదుషా వారి హయాంలో, ఒకశేటు మాబోటి సిద్ధులందరిని కూటానికి పిలిచాడు. గంగనడివిఁని పడవ మీద పీపాలలో సారాయి భరాయించి, బంగారపు గిన్నెలతో అందిచ్చాడు. రెండు ఝాముల రాత్రి అయేసరికి వీపాలు కాలీ అయిపోయినాయి. అంతా పడిపోయినారు. హెడ్డు : యేమి ఆశ్చర్యం! బైరాగి : మేమూఁ ఒక్క నేపాళపు బ్రాహ్మడూ మిగిలాం. “తే! తే!” అన్నాడు ఆ బ్రాహ్మడు. “తెస్తావా శపించేదా” అన్నాడు. శెట్టి యెక్కడ తెస్తాడూ? వాడు మా కాళ్లు గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు 344