పుట:Gurujadalu.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బైరాగి : సత్యం, సత్యం. దుకాణదారు : గురోజీ! తమకి అంతా యిశదవేఁ! ద్రోహం గాజుకుప్పె, ద్రోహంలో వుండేది పరవాఁత్వ! గాజు కుప్పెలో వుండేది అన్నసారం. యీ అన్నసారం ద్రోహంలో పడితే గానీ పరవాత్మ పెజ్జిలించదు. యేం శలవు? బైరాగి : యీ పరమ రహశ్యం నీకు యెలా తెలిశింది తమ్ముడా? దుకా : తమవంటి వారి దయవల్లగురూ! (నలుగురి వైపూ చూసి) చూశారాబాయీ నేను యెప్పుడూ యీ మాటే గదా చెపుతూ వుంటాను? అఖాడాకి వొస్తే గాని పరబ్రైమ్మం పట్టుపడ్డం యేలాగు? బైరాగి : అమృతమనేది యేమిటి? సారాయే! నాడు యిదే గదా తాగడానికి దేవాసురులు తన్నుకు చచ్చారు? వీరేశ : చివచివా! చివచివా! మనవాళ్ల: రామానుజ - రామానుజ! మునస: కాట్లాటమాని ఘానం యినండొస్సి - యెట్టి గొల్లోళ్లు. హెడ్డు : గురూ, మరివొక రసలింగం చేయించి, శిష్యుడికి దయ చెయ్యాలి. బైరా : అలాగే. మునస: గురూ! బంగారం చేస్తారు గదా, అదెట్టి, హరిద్దారంలో మటం కట్టించక మాలాటోళ్ళని డబ్బెందుకడుగుతారు? బైరా : మేం చేశే స్వర్ణం మేవేఁ వాడుకచేస్తే తలపగిలి పోతుంది. హెడ్డు : అవి వేరే రహస్యాలు వూరుకోండి మావాఁ! గురోజీ! హరిద్వారంలో చలి లావుగాబోలు? బైరాగి : నరులక్కద్దు - మా బోటి సిద్ధులకు, చలీ, వేడీ, సుఖం, దుఃఖం యెక్కడివి - హెడ్డు :

ఆహా! అదృష్టవంటే సిద్ధులే అదృష్టం.

మునస: గురు, హరిప్ట్రం నించి యెప్పుడు బైలెళ్తారు? బైరా : రెండు రోజులయింది. మొన్న ఉదయం ప్రయాగ, నిన్న వుదయం జగన్నాధం శేవించాం. ఖేచరీగమనమ్మీద ఆకాశమారాన్న పోతూ వుండగా మీ వూరి అమ్మవారు వనం దగ్గిర గమనం నిలిచిపోయింది. యేమి చెప్మా? అని యోగదృష్టిని చూసేసరికి అమ్మవారి విగ్రహము కింద నిలువుల లోతున, మహాయంత్రం వొకటి స్థాపితమై కనపడ్డది. అంతట భూమికి దిగి, అమ్మవారిని శేవించుకొని, ప్రచ్ఛన్నంగా పోదావఁంటూంటే, యీ భక్తుడు మమ్మల్ని పోల్చి నిలిపేశాడు. గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు 343