పుట:Gurujadalu.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మనవాళ్లయ్య: ఆకాశంబు సూన్యంబు అనగా యేమీ లేదన్నమాట. మునసబు : యేటీ లేదా? గుఢాళ్లకి యేటీ లేదు. తెల్లోడు యెర్రోడా? పట్టంలో గొట్టావెంట్టి అదే సూస్తాడే ఆకాశం కాసి? మనవాళ్లయ్య: శాస్త్రంబులలోని రహస్యంబులు మ్లేచ్ఛులకెట్లు తెలియును? మునసబు : అల్లాండం, బెల్లాండం, శక్కరపొంగలి తినడవఁనుకున్నావా, నామాలోడా? తెల్లోడి మహిమ నీకేటి తెలుసును! తెల్లోడి సారాయికి, తెనుగోడి సారాయికి యంత భేదం వుందో, తెల్లోడికి నీకూ అంత భేదం వుంది. మనవాళ్లయ్య: గణిత శాస్త్రంబునం దాకాశంబన సున్న - సున్నయన సూన్యంబు - యేమీ లేదన్న మాట. వీరేశ : చాత్రంలో మన్ను, మిన్ను, అని అన్నాడు కాడా? మన్ను లేదా? మున్నుంటే, మిన్నుండదా? మునసబు: యీరేచ మామేలయిన పలుకు పలికినాడు. వీరేశ: "ఆకాశం బొక్కడ్డది!” అంటురు గదా! ఆకాశం లేకుంటే బొక్కడ్డవెఁలాగ? మునసబు : శబాసు యీరేచ! నామాలోడు పలకడేం? నోరు కట్టడ్డది. (వీరేశ - శంఖం పూరించును) హెడ్డు : (దుకాణదారునితో) యేవిఁటీ అల్లరి భాయి? మునసబు: యీరేశం గెల్చుకున్నాడు గదా, చంకం వోగించడా? దుకాణదారు: గురోజీగారి సమాదికి బంగం వొస్తే శపించి పోతారే? బైరాగి : (కళ్లు తెరిచి) శివబ్రహ్మం! శివబ్రహ్మం! శివోహం! వీరేశ : చూచావు నేస్తం, చివబ్రెమ్మం అన్నారు. బైరాగి : రామబ్రహ్మం! రామబ్రహ్మం! రామోహం! మన: మొదటి మాటను రెండవమాట రద్దు చేయును. రామానుజ! రామానుజ! వీరేశ : చివ చీవా! చీవ చివా! దుకాణదారు: యెందుకు కాట్లాడతారు. నీ శివుడూ నిజవేఁ. అడుగో ఆశీసాలో యెలుగుతున్నాడు. నీ రాముడూ నిజవేఁ. అడుగో ఆ శీసాలో యెలుగుతున్నాడు. వినలేదా తత్తం? గాజుకుప్పెలోను గడగుచు దీపంబు॥ యెట్టులుండు గ్యానమట్టులుండు| తెలిశినట్టి వారి ద్రోహంబులందును, యిశ్వదాభిరామ యినరవేమా|| కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 342