పుట:Gurujadalu.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మీనా : యేం జేసిందో? పెట్లో దాచిందేవోఁ? దాని వొంటినే వుంది గాబోలు నాన్నా? లుబా : వొంటినుంటే - దెయ్యానికి కంటెందుకూ? మీనా : యేం? తీపు దిగదీసిందా యేవిఁటి? పెట్టుగుంటుంది. లుబ్దా : : నూతులో దిగి గవరయ్య నుయ్యంతా గాలించాడూ? మీనా : గడియ సేపు గాలించాడు. లుబ్ధి : నువు చూశావూ? మీనా : చూశాను. లుబ్దా : అది రావఁప్పంతులు యింటికి వెళ్లిందేమోనే? మీనా : గవరబాబు, సీసాలో బిగించాడు గదా, యలా వెళుతుంది? లుబా : యేమో నాకేం పాలు పోకుండా వుంది. రా పరుందాం మన ప్రారబ్ధం యిలా వుంది. (నిష్క్రమింతురు.) ఆవ స్థలము : రామచంద్రపురం అగ్రహారంలో సారా దుకాణం వెనక తోట) (ఆ తోటలో కాళీమందిరం యెదటి మంటపం. మంటపంలో కాళీ విగ్రహానికి యెదురుగుండా ఒక పెద్ద పీట మీద మూడు సీసాలతో సారాయి; చుట్టూ గజాసులు, వీట నిండా పువ్వుల దండలు, మంటపంలో వక వైపు పులి చర్మం మీద యోగదండమును ఆనుకుని సమాధిలో వున్న వొక బైరాగి; యోగిని యొకతె సారాయి అందరికీ అందిచ్చును. గ్రామ మనసబు సోమినాయుడు చిలుం పీల్చుచుండును. సాతాని మనవాళ్లయ్య, జంగం వీరేశ, దుకాణదారు రామందాసు చెదిరి కూర్చుందురు) మునసబు : ఆకాశం ముందు పుట్టిందా? బూDC ముందు పుట్టిందా? మనవాళ్లయ్య: సుత్తి ముందా? కారుముందా? మునసబు : పంగనావాఁలుముందా పట్టెవొనాలు ముందా? నామాలోడా నా సవాలేటి? నీ ఋవాబేటి? ఆకాశానికి మట్టాబూవిఁ? బూవీఁకి కప్పా ఆకాశం? సదువుకున్నో డెవడో సెప్పండొస్సి - గురుజాడలు 341 కన్యాశుల్కము - మలికూర్పు