పుట:Gurujadalu.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భుక్త : నాకు కాళ్లు మేహవాతం నొప్పులు. నేను గెంతలేనే? మధు : (దీపవాఁర్పి) యిలాగే వుండండి. పోలి : నరశింవ్వ - మధు: చప్! పోలి : సచ్చాను. మధు : (గది గొళ్లెం వేసి, వీధి తలుపు గడియ తీసి, తలుపు ఓరగా వుంచి) మాయగుంటని యెక్కడ దాచారు? రామ : మాయగుంట యేమిటి? మధు : యేం నంగనాచే? లుబ్ధావధాన్లు మాయ పెళ్లాన్ని వాళ్ల యింట్లోంచి లేవదీసుకుపోయి యెక్కడ పెట్టారు? యిదే కదూ, రాత్రల్లా మీరు చేస్తూన్న లౌక్య వ్యవహారం? రామ : నీ మాట నాకేవీఁ అర్థం కాకుండా వుంది. యింట్లోంచి లేవదీసుకుపోవడవేఁవిఁటి? నేను దాచడ వేఁవిఁటి? మధు : దాస్తే దాచారు. దాచకపోతే మానారు. నాకంటే యేదీ? రామ : నీకంటా? మరిచిపోయినాను సుమా. మధు : యేమి చిత్రం! నన్ను మరిచారు -నా వస్తువ అని, మరిచారు. మరిచి, ఆ గుంట కిచ్చారు. దాన్ని లేవదీసుకుపోయి యెక్కడో దాచి, నిశిరాత్రి వేళ పెద్దమనిషిలా, యింటికి వొచ్చారు! రామ : ఆ గుంట కనపడదా యేవిఁటి? మధు : యేవిఁ నాటకం! మీకు కనపడకేం! మీరు పెట్టిన చోటే వుంది. రామ : మీనాక్షి తన్ని తగిలేశిందా యేవిఁటి? కంటెతో తగిలేస్తే చచ్చానే? మధు : యేమి నాటకం! చావండి; బతకండి; ఆకంటెతాందీ గడపలో కాలు పెట్టనివ్వను. (తలుపు వేయును) రామ : నాలుగుకోసులు గుఱ్ఱపసవారీ అయి, ఝసురోమని యిల్లు చేరుకుని, గుమ్మంలో అడుగు పెట్టేసరికి మబ్బులేని పిడుగుపడ్డది. మీనాక్షి ఆగుంటని మన్ననిస్తుందని, నేను యెన్నడయినా అనుకున్నానా యేవిఁటి? ఆ గుంట పోతేపోయింది, వుంటే వుంది; నా కంటే పోకుండా వుంటే అదృష్టవంతుణ్ణి. కంటే అడగడానికి వెళితే “నువ్వే యీ పెళ్ళి కుదిర్చావు” అని కజ్జుచ్చుకుంటాడేమో! (నిష్క్రమించును.) కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 336