పుట:Gurujadalu.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మధు : పోలిశెట్టియేమి, పడుకుని లేవడు - మేలుకొలుపులు పాడనా? భుక్త రామప్పంతులేడీ? మధు : రామప్పంతులూ లేరు, గీమప్పంతులూ లేరు. యింట్లో పనిచేసేవాడు తలుపు కొట్టాడు. బెంగెట్టుకోకండి. భుక్త : అతగాడి మాటలు వింటేనే? మధు : నేనే ఆయన గొంతుకు పెట్టి మాట్లాడాను. యేమి ధైర్యం! యేమి మగతనం! పోలి : “నరశింవ్వ, నీదివ్వె” (లేచి) “నామమంతరము సేత”-యవడి ముక్కలాడి దగ్గిరున్నాయా? (అంతా మళ్లీ ఆటకు కూచుందురు) సిద్ధాం: 0: ఆట కలిపేశాను. పోలి : గోరం! గోరం! నాకు యిసిపేటు ఆసు దాడదదొచ్చింది గదా, బేస్తులు గెలుసుకుపోదునే! గోరం! గోరం! మధురోణి, ఒట్టినే బెంబేరు పెట్టేశింది. అటక మీంచి పడి నడుం విరిగిపోయిందిరా దేవుడా. భుక్త : నీ కిందపడి నేను నలిగిపోయినాను. నీకేం తీపు దిగదీసింది? పోలి : కలిపియెయ్యెయ్యి - ముక్కలు. సిద్దాం : నేను కలపను - నా వొంతు అయిపోయింది నువు కలుపు. పోలి : యేటైపోయింది? (రామప్పంతులు వీధి తలుపు తట్టును. ) రామ : లక్ష్మీ, లక్ష్మీ, తలుపు. మధు : యీ మాటు పంతులే. పోలి: యేటి సాధనం? మధు : గోడగెంతి వెళ్లిపోండి. పోలి : నేను గెంతలేనే? మధు : నిన్ను యీ గదిలో పెట్టి తాళం వేఁస్తాను. పోలి : దీపం ఆరిపెయ్కు నాకు బయవేఁస్తుంది. సిద్ధాం : గాజు పెంకులు గుచ్చుకుంటాయి; గోడ దాటడం యెలాగ? కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 335