పుట:Gurujadalu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తప్పక కంటబడతాడు. పుట్టుకనుబట్టి వేరు సమూహానికి చెందిన వారైనా, వారి అనుభవాలు, వారి వ్యక్తీకరణ విధానాలు, వారి వ్యక్తిగత చిత్తశుద్ధి అయినా, మూటగట్టుకున్న తిట్లైనా, మెప్పులైనా తమకు ఉపయోగిస్తాయా లేదా అన్న దృష్టితో చూస్తారు.

ఇది భవిష్యత్తుపై నా అంచనా.

ఈ అంచనా ఏమాత్రం నిజమైనా ఈ పుస్తకం ఈ రూపంలో తెచ్చిన కృషి ఫలిస్తుంది.

              చెట్టపట్టాల్ పట్టుకుని
              దేశస్తులంతా నడువవలెనోయ్
              అన్నదమ్ముల వలెను జాతులు
              మతములన్నియు మెలగవలెనోయ్

అన్న గురజాడ వేడికోలుతో అందరం కలసి ఆలోచించుకోవాలన్న ప్రేరణ నయినా పొందుతాం!

              మతమునెన్నడు మరవనీకుము
              మంచిగతమేనని భ్రమించనీయుము
              జ్ఞానమొక్కటి కలియనీకుము

అంటున్న వ్యాపార ప్రపంచ పాలనలో మనం జ్ఞానోదయం కోసం ధైర్యం తెచ్చుకుంటే

              మతములన్నియు మాసిపోవును
              జ్ఞానమొక్కటై నిలచి వెలుగును - అన్న గురజాడ ఆకాంక్షని మానవుని ఆకాంక్షగా గుర్తించగలుగుతాం!

అందుకోసం మా ఉడతాభక్తి ప్రయత్నం ఈ గ్రంథం.

- మీ మనసు వివిన మూర్తి