పుట:Gurujadalu.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మనిషి: మెడపైకి వుంచు. (మధురవాణి అటుల చేయును. ఆ మనిషి మధురవాణి మెడలో కంటె వుంచును.) మధు : ఔరా! యింద్రజాలి! పంతులు గొంతుక యెలా పట్టావు? నన్నే మోసపుచ్చితివే? (రెక్క పట్టుకొని) గదులోకిరా. (గదులోనికి తీసుకువెళ్లును) యీ చిల్లంగి కళ్లు నీకేదేవుఁ డిచ్చాడు (ముద్దెట్టుకొనును) వాళ్లింట యేవేఁవిఁ చిత్రాలు చేశావో చెప్పు. శిష్యు : ముద్దెట్టుకోనంటే, చెబుతాను? మధు : నీకు తగనో? శిష్యు : ముద్దెట్టుకుంటే యెంగిలౌతుంది. మధు : నిజం. నీకున్న బుద్ధి నీ పెద్దలికి లేదు. నన్ను నిష్కారణంగా భయపెట్టావు. అందుకు నీ కేవిఁటి సిక్ష? బుగ్గ కొరికేతునా? శిష్యు : పాలూ, పంచదారా వుంటే ఇయ్యి. మధు : తరవాత మేపుతాను. ముందు నీకు దాసరి వేషం వేస్తాను. కొత్త అగ్రహారం పోయి నీ గురువును చేరుకుందు గాని. (తెర దించవలెను) (చీకటి గదిలో పోలిశెట్టి, భుక్త, సిద్ధాంతి వుందురు తెర అవతల నుంచి రామప్పంతులు గొంతుకతో, శిష్యుడు “యీ గదులో యవణో దాచావు” మధు : రామ! రామ! యవ్వడూ లేడు. (పోలిశెట్టి నిచ్చెనయెక్కును, భుక్త కూడా యెక్కబోవును. నాలుగు మెట్లెక్కి యిద్దరూ కింద బడుదురు. ) పోలి : సంపేశినావు, బాపనాడా! భుక్త : నా మీద నువ్వు పడి, నేను వుక్కిరిబిక్కిరి ఔతూంటే, నువ్వు సచ్చానంటావేవిఁటి? లేస్తావా? కరిచేదా? శిష్యు : (రామప్పంతులు గొంతుకతో) అదుగో లోపల యెవజ్ఞో మాట్లాడుతున్నారు. లంజా! అదికోవఁటాడి గొంతుకలా వుంది. కప్ప తాళం వేసి వూరందరినీ లేవదీసుకొస్తాను. మధు : కప్పతాళవెందుకు? లోపల యెవళ్లూ లేరు. దెయ్యాల కొంప - దెయ్యాలు దెబ్బలాడు తున్నాయి. (మధురవాణి తలుపు తీసి గదిలో ప్రవేశించి అగ్గిపుల్ల వెలిగించును. శిష్యుడు పక్కకి తొలగిపోవును. ) కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 334