పుట:Gurujadalu.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గిరీ : రాకపోతే, మీ చెల్లెలికి యీ పెళ్లీ తప్పదూ, నాకు చావూ తప్పదూ. బుచ్చ : అలా అనకండి. గిరీ : అనకపోతే మాత్రం, చావు తప్పేదుంది గనకనా? నిన్ను వొదిలి బతకలేను, అది వకచావు, నువ్వు నా మీద వొట్టు వేసుకుని ఆ మాట తప్పిపోతే, నన్ను దేవుఁడే చంపేస్తాడు. అది రెండో చావు. మరి నాకు చావు యెలా తప్పుతుంది? బుచ్చ : నానించి మీరు చచ్చిపోతే, నేనూ చచ్చిపోతాను. చచ్చిపోకండి. గిరీ : నా వశవాఁ? అడుగో నీ తమ్ముడు వొస్తున్నాడు. మరి మనం యీ కష్టసుఖాలు మాట్లాడుకోవడానికి వీలు చిక్కదు. ఒక్క మాట చెప్పు. బతకమన్నావా? చావమన్నావా? బుచ్చ : వెయ్యేళ్లూ బతకండి. గిరీ అలాగైతే, నాతో రావడం ఖాయవేఁనా? బుచ్చ : యేంజెయమంటే అది చేస్తాను. (వెంకటేశం మిడతను పట్టుకు ప్రవేశించును.) వెంక : యిదుగోనండోయి, గొల్లభావఁని పట్టుకున్నాను. గిరీ : చూశావూ, వొదినా! నీ తమ్ముడు చిన్న గుంటడయీ, అప్పుడే గొల్లభావఁల్ని పట్టుగుంటున్నాడు. బుచ్చ : (ముసిముసి నవ్వు నవ్వుచు) మిడత! (బుచ్చమ్మతో) యిన్నాళ్లకి మిడతంభొట్లు చేతులో చిక్కాడు. (వెంకటేశంతో) యిలాతే - మిడ పట్టుకోవడం మంచి ఎడ్యుకేషన్ - యిదే, నాచురల్ హిస్టరీ, ప్రకృతి శాస్త్రం అంటారు. వెంక : అక్కయ్యా - కొంచం ఊరుబిండి! గిరీ

అమ్మ చూస్తే తంతుంది.

వెంక : అమ్మ చూడదులే! (ఊరుబిండి చేతులో వేసుకుని నాలుకతో నాకి గెంతును.) (తెరదించవలెను)

గురుజాడలు 322 కన్యాశుల్కము - మలికూర్పు