పుట:Gurujadalu.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బుచ్చ : చెయ్యనా? గిరీ : యేమో, చేస్తావో చెయ్యవో! చేస్తానని ప్రమాణం చేస్తేనే, ఆ మాట నేను చెబుతాను. బుచ్చ : యాఁవఁని ప్రమాణం చెయ్మన్నారు? గిరీ : నా మీద ప్రమాణం చెయ్యి. బుచ్చ : మీ మీద ప్రమాణమే; చెప్పండి.

అయితే విను. వొంటరిగా చూసి, యీ మాటే నీతో రహస్యంగా చెప్పుదావఁని కాచి,

కాచి వుండగా, యీ వేళ, మీ తండ్రి వూరికి వెళ్లడం, మీ తల్లి వాకట వుండడం నుంచి, సమయం చిక్కింది. చెవి వొగ్గి విను. నీ చెల్లెలి పెళ్లి తప్పడానికి ఒక్కటే సాధనం వుంది. అది యేవిఁటంటే, నువ్వు ముందూ వెనకా ఆలోచించక, నాతో లేచివచ్చి నన్ను పెళ్లి చేసుకోవడవేఁ - లేకుంటే నీ చెల్లెలి పెళ్లి తప్పదు. బుచ్చ : (ముసిముసి నవ్వుతో) నేను మీతో లేచివొస్తే మా చెల్లెలు పెళ్లి ఆగిపోతుందీ? యేవిఁ చిత్రాలు! గిరీ : ఆ మాట నీ చేతనే వొప్పిస్తాను కదూ - విను - పెళ్లికి తర్లివెళ్ళుతూన్నప్పుడు, రెండో నాడు రాత్రి బండీ వాడి చేతులో నాలుగు రూపాయలు పెట్టి, నీ బండీ తోవ తప్పించి అనకాపిల్లి రోడ్డులో పెట్టిస్తాను. అక్కడ నుంచి రామవరం దాకా మా స్నేహితులు అంచీబళ్లు ఖణాయిస్తారు. ఆడుతూ పాడుతూ, మనం దౌడాయించి రామవరంలో పెళ్లాడేసుకుని సుఖంగా వుందాం. యిక మీ వాళ్ల సంగతి యేవాఁతుందీ? మనం వుడాయించిన మన్నాడు. తెల్లవారగట్ల, నీ బండీ కనపడక, కలవిలపడి, మీ వాళ్లు నెత్తీ నోరూ కొట్టుకుంటారు. నీ చెల్లెలు పెళ్లి ఆగిపోతుంది. మరి రెండు రోజులికి మనం పెళ్లాడావఁని తెలుస్తుంది. నిన్ను ముసలివాడికి కట్టిబెట్టి నందు వల్ల కలిగిన చిక్కులు చూస్తూ, నీ తండ్రి నీ చెల్లెలికి మళ్లీ ముసలి సంబంధం చెయ్యడు. నీ తండ్రి ఒకవేళ మూర్శించి పెళ్లి చేస్తానన్నా, మన తమాషా విన్న తరువాత, నా అన్న నీ చెల్లెల్ని మరి పెళ్లి చేసుకోడు, యిది సిద్ధాంతం అవునా కాదా? బుచ్చ : అవును కాబోలు. గిరీ : అయితే మరి అందుకు సమ్మతేనా? బుచ్చ : యెందుకు? గిరీ : నాతో వెళ్లిపోయి రావటానికి. బుచ్చ : అమ్మ నాయనా, నా ప్రాణంపోతే నేను మీతో రాను. గురుజాడలు 321 కన్యాశుల్కము - మలికూర్పు