పుట:Gurujadalu.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బళ్ళు! నిన్ను నడవనిస్తానా? పుష్పం లాగ నెత్తిమీద పెట్టుకుంటాను. అప్పుడు నీకు కలిగే ఆనందం ఆలోచించుకో. బుచ్చ : నా జన్మానికి మరి ఆనందవెఁక్కడిది? గిరీ : నేను, నీకు దాసుడనై, “యిదుగో నన్ను స్వీకరించు, నన్ను పెళ్ళాడి, ఆజన్మం ఆనందం అనుభవించు. నన్ను ఆనందంలో ముంచు” అని బతిమాలుకుంటూంటే, నువ్వు అట్టి సులభసాధ్యమైన సుఖమును కాలున తన్నుకు వెళ్లిపోయి, నా బతుకు కూడా బుగ్గిని కలిపితే, నేనేమి చెయ్యగలను? బుచ్చ

మీ బతుక్కి లోపవేఁవి? మీరు మహరాజులు.

గిరీ నువ్వునన్ను పెళ్లాడితే నేను మహారాజునే అవుతాను. నీ నోటంట వచ్చిన మాట అమోఘం వొట్టినే పోకూడదు. గనక నాతో వెళ్లిపోయిరా. బుచ్చ : అమ్మ నాయనా! నే మీతో రాను. గిరీ : సరే. రాకపోతే నేనే గదా ప్రాణత్యాగం చేస్తాను? పీడనాడా కూడా పాయె. బుచ్చ : అలాంటి మాటలు అనకండి.

చేసేమాట, చెబితే తప్పేమిఁటి? నేనేమైతేనేం గాని, నీ చెల్లెలిమీదైనా నీకు కనికరం

కద్దా? బుచ్చ

అదేం, అలా అడుగుతున్నారు?
నిజంగా కనికరం వుందా?

బుచ్చ : వుండకుండా వుంటుందా? గిరీ : వుంటే, యీ పెళ్లి తప్పించే సాధనం నీ చేతులోనే వుంది. బుచ్చ : నా చేతులోనా? గిరీ

అక్షరాలా.

బుచ్చ : యేమి చిత్రమైన మాటలు చెబుతారు! గిరీ : యీ భూ ప్రపంచం మీద వుండుకున్న యావన్మంది స్త్రీలలోనూ, నిన్నొక్కరైనూ వలిసి, నేను నీకు సుతరామూ లొంగిపోబట్టి గదా, నా బతుకు హాస్యాల కింద ఐపోయింది? బుచ్చ - ఆలా అనకండి. గిరీ : పోనియి - ఆ మాత్రం భరవసాయిచ్చావు. ఒక మాట నాకు ప్రమాణ పూర్తిగా చెప్పు. నీ చెల్లెలు పెళ్లి తప్పించడం, నీ చేత అయితే, చేస్తావా? కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 320