పుట:Gurujadalu.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తలుచుకుని నిద్దర పట్టక, రెండు ఝాముల రాత్రప్పుడు నా గదిలో యీజీ చెయిరు మీద కూచుని వుండగా-యదట బల్లమీద మెరుపుదీపం, గోడని నిలువుటద్దం వున్నాయి ఆ అద్దంలో నా ముఖం చూసుకుని యేమంటానూ? “యీ సొగుసైన ముఖం, యీ తామర రేకుల వంటి నేత్రాలు, యీ సోగమీసాలు, యివన్నీ వృధా గదా? యవరు చూసి ఆనందించనూ? నా బుచ్చమ్మ, నన్ను పెళ్లాడక పోయిన తరవాత నా బతుకు యెందుకు” అని, నిస్పృహ కలిగి ఛఱ్ఱున టేబిలు సొరుగు తీసి, అందులోవున్న జోడు గుళ్ల విస్తోలు యెక్కు బెట్టి గుండె దూసిపోయేటట్టు కొట్టేసుకుంటాను. బుచ్చ : కొట్టుకోకండి. మీరు అలా అంటే నాకు యేడుపొస్తుంది. గిరీ : తక్షణం దేవతలు విమానం పంపించి నన్ను స్వర్గానికి తీసుకువెళతారు. స్వర్గానికి వెళ్ళానని నాకు అక్కడ మాత్రం సుఖవుఁంటుదనుకున్నావా వొదీనా? నవాభరణ భూషితురాలయి రంభ తక్కుతూ తారుతూ వొచ్చి, “హా! ప్రియ! గిరీశ! నీలాంటి సుందరుణ్ణి యన్నడూ నేను చూడలేదు. రమ్ము, నన్ను చేకొమ్ము” అని రెక్కబట్టుకు లాగుతుంది. నేనేవఁంటానూ? “ఛీ! అవతలికిఫో! నేను ఏంటీ నాచ్చి! సానిది తాకితే, పరమ అపవిత్రంగా తలుస్తాను. పియర్సు సబ్బు రాసి కడిగితేనే గాని యీ చేతికి కశ్మలం పోదు. నువ్వా రంభవి? మా బుచ్చమ్మ సొగుసుకి నువ్వువొడ్డీకి పనికిరావు, గోయెవే, డామ్, డర్టీ గూస్” అని అంటాను. అలాగే, మేనకా, ఊర్వసీ, తిలోత్తమా మొదలైన యావన్మంది అప్సర స్త్రీలనీ తన్ని తగిలేస్తాను. తగిలేసి, కాషాయ వస్త్రాలు ధరించి కల్పవృక్షచ్చాయని “హా! బుచ్చమ్మా, బుచ్చమ్మా” అని నీ పేరు జపం చేస్తూ అనేక సంవత్సరాలు పద్మాసనం మీద వుండిపోతాను. అంతట కొన్నాళ్లకి నా తపస్సు ఫలించి, నువ్వు నందనవనంలోకి చంద్రోదయం లాగ బయలుదేరి వస్తావు. నేను “ప్రియురాలా! యెన్నాళ్లకి వొచ్చావు!” అని అమాంతంగా వెళ్లి నీన్ను కౌగలించు కుంటాను. అప్పుడు నీ మొదటి మొగుడు, ముసిలి వెధవ, గావంచా గుడ్డకట్టుకుని, పొడుంముక్కుతో “బుచ్చమ్మ నా పెళ్లాం” అని అడ్డురాబోతాడు. “వెధవాయా, నువ్వు బుచ్చమ్మకి తగవు. నీ రూపాయలు నువ్వు పట్టుకుపో” అని, వొక్క తాపు తన్ని తగిలేస్తాను. మనం యిద్దరం సుఖంగా స్వర్గంలో శాశ్వతంగా వుండిపోతాం. బుచ్చ : యేడుస్తూన్న దాన్ని నవ్విస్తారు. గిరీ : నువ్వు నన్ను పెళ్లాడితే, మనం బతికున్నంత కాలం నవ్వుకుంటూ, ఆనందిస్తూ కాలం వెళ్లబుచ్చుతాం. అప్పుడు నిన్ను యిలా పప్పు రుబ్బనిస్తానా? మనకి యెంత మంది నౌఖర్లు వుంటారు! యెంతమంది చాకర్లు వుంటారు! తోటలు, దొడ్లు, గుజ్జాలు, గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు 319