పుట:Gurujadalu.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జీతంలేని బాపనక్కలాగ పనీ పాటూ చేస్తుందని, వాడి ఆశ. నేను కూడదని యంత గడ్డి పెట్టినా విన్నాడు కాడు. యీ కష్టాలన్నీ యిలా వుండగా నాకు మరో భయం వేస్తూంది. చెబితే కోపం తెచ్చుకోవు గద! బుచ్చ : మీరేం చెప్పినా నాకు కోపం లేదు. గిరీ

ఆ మాత్రం ధైర్యవిఁస్తే నాక్కావలసిందేవిఁటి? రామచంద్రపురం అగ్రహారీకులు బహు

దుర్మార్గులు - మా అన్న చచ్చిపోయిన తరవాత నీ చెల్లెల్ని తిన్నగా ఉండనియ్యరు. అదికూడా మా మీనాక్షి మోస్తరౌతుంది. బుచ్చ : మీనాక్షికేం లోపం వొచ్చింది? గిరీ

యేవఁని చెప్పను. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. అయినా నీ దగ్గర

నాకు దాపరికం యేవిఁటి? దాని మొగుడు పోయిన తరవాత యేటేటా కడుపు, అవుతూ వుండడం. అయినప్పుడల్లా వొల్లమాలిన అల్లరిన్నీ. ఒకప్పుడు అది ప్రాణభయం కూడా చేస్తుంది. ఆ వూళో రామప్పంతులని వొక పరమదుర్మార్గుడు నియ్యోగప పంతులు వున్నాడు. వాడు ఒక సానిదాన్ని వుంచుకున్నాడు. యెందరినో సంసార్లని చెడగొట్టాడు. మా అన్న వ్యవహారాలన్నీ ఆ పంతులే చూస్తాడు. మా అన్న చచ్చిన ఉత్తరక్షణం, నీ చెల్లెలికి వొల్లమాలిన ధనం చేతిలోకి వొస్తుంది. స్వాతంత్ర్యం కలుగుతుంది. “యేమి ఇది?” అని అడిగే వాడుండడు. యిహ, చెడిపోవడానికి అభ్యంతరవేవిఁటి? “నేను కట్టుగావున్నాను కానా?” అని నువ్వు అనగలవు. నీ మొగుడి తాలూకు ఆస్తి నీ చెయ్యి చిక్కలేదు. మొగుడి యింటికైనా నువ్వు వెళ్లలేదు. బుచ్చ : అవును. గిరీ

తల్లిదండ్రుల చాటున ఖాయిదాగా వున్నావు. పరాయి వాడు యింట్లో అడుగు బెట్టలేడు.

గాని యిలా యెంతకాలం వెళ్లుతుంది? నిన్ను తల్లిదండ్రులు కలకాలం కాపాడలేరు గదా? వాళ్లు పోయిన తరవాత నీకూ స్వాతంత్ర్యం వొస్తుంది. యే కాలానికి మనసు యలా వుండునో? అప్పుడు కాలుజారిన తరవాత, నువ్వు యేవఁనుకుంటావు? “అయ్యో నాడు గిరీశాన్ని శాస్తోక్తంగా పెళ్ళాడి పునిస్త్రీనయిపోతే, పిల్లా పేకా కలిగి, అప్లైశ్వ ర్యంతో తులతూగుదును గదా, యీ దురవస్థ నాకు రాకపోవును గదా” అని విచా రిస్తారు. అప్పుడు నే యెక్కడ వుంటానూ? స్వర్గంలో మీకోసం యెదురు చూస్తూ వుంటాను. యీ పెళ్ళి అయిపోయిన తరవాత వెంకటేశమూ, నేనూ పట్టానికి వెళ్ళిపోతాం. నిన్ను, తలుచుకుంటూ, నిద్రాహారం మానేసి, కొన్ని రోజులు వుంటాను. యెంతకాలవఁనీ మనిషన్న వాడు, నిద్రాహారం మాని వుండగలడు? నిన్ను తలుచుకుని కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 318