పుట:Gurujadalu.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బుచ్చ : అయితే మీతో నాకేం పనీ? యింత సందడిగా పెళ్లి పనులు చేయిస్తున్నారు. మా నాన్నకి తోచకపోతే, మీకైనా తోచకూడదా, యీ సమ్మంధం కూడదని? మీకు కూడా దానిమీద ఇంత కనికరం లేకపోవాలా? లుబ్ధావుఁధాన్లు మీకు అన్నగారని కాబోలు మీకు సంతోషం. గిరీ : నాకా సంతోషం? యంత క్రూరమైన మాట అన్నారు! ఈ సంబంధం ఔతుందని, నా మనస్సులో యంత భేదిస్తున్నానో, ఆ భగవంతుడికి తెలుసును. యీ సంబంధం తప్పించాలని చెడ చివాట్లు పెడుతూ మా అన్న పేర రెండు టావులు వుత్తరం రాశాను. చెవిని పెట్టాడుకాడు. నేను యేంచేతును? వాడిని స్మరిస్తేనే పాపం వొస్తుంది. ఊరికే కూచుంటే, మీ తండ్రి యేవఁను కుంటాడో అని, మీ యింట అరవ చాకిరీ చేస్తూ నీకు యేనాటికైనా కనికరం వొస్తుందేమో అని ఒక్క మనిషిని నూరుమంది చేసేపని చేస్తున్నాను. అంతేగాని, యీ నమ్మిన నౌఖరు మీద నీ మనసు భారంగా వుంటే, యవరికీ చెప్పకుండా యీ రాత్రి లేచి మా దేశానికి వెళ్లిపోతాను. బుచ్చ : వెళ్లిపోకండి.

నేను మాత్రం పోయే సాధనం యలాగ? యెన్నో మాట్లు యేవఁనుకుంటాను? యీ

పెళ్లి తప్పించ లేకపోయినాను గదా? నా ప్రాణం కంటే యిష్టవైఁన యీ బంగారపు బొమ్మలాంటి బుచ్చమ్మని పునిస్త్రీని చెయ్యలేక పోయినాను గదా? అని విరక్తి పుట్టి, పోదాం అని నిశ్చయించే సరికి కాలు ముందుకు వేసినా, మనస్సు వెనక్కి లాగి యేమితోచేదీ? “పైకి పోతానని సందడి పడుతున్నాను. నా బుచ్చమ్మ కనపడకపోతే, పోయి బతకడం యలాగ? దానికి యంత కనికరం లేకపోయినా, యిక్కడే వుండి చూశైనా సంతోషిద్దాం” అని వుండి పోతూ వొచ్చాను. బుచ్చ : మీరు చెబితే, లుబ్ధావుఁధాన్లు గారు పెళ్లి మానుకుంటాడని తమ్ముడు చెప్పాడు? గిరీ : నే చెప్పినమాట, యీ భూప్రపంచంలో యవడూ కొట్టి వెయ్యలేడు. అందుచేత, వెంకటేశం అలా అని వుంటాడు గాని, మీ తండ్రి ఒకడు, మా అన్న వకడు లోకా తీతులు. వాళ్లు బ్రహ్మ చెబితే వినరు. ఈయనకి వెట్టికోపం. అతగాడు శుద్ధ పీసిరిగొట్టు. మా అన్న సుఖపడ్డానికా యీ పెళ్ళి తలపెట్టాడు? నీ మొగుడు నిన్ను పెళ్లాడి యంత సుఖపెట్టాడో, మా అన్న నీ చెల్లెల్ని పెళ్లాడి, అంతే సుఖ పెడతాడు. ఆఫ్రికా దేశంలో స్లేవరీ అని వుంది. అనగా మనుషుల్ని పట్టి పశువుల్లాగ బజార్లలో అమ్ముతారు. యవరు కొనుక్కుంటే వాళ్ల యింట్లో ఆయా మనిషి బతికినన్నాళ్లూ చాకిరీ చెయ్యాలి. అలాగ్గానే మా అన్న, మీ చెల్లెలిని పెళ్లి అనే మిషపెట్టి కొంటున్నాడు. వాడింట యిది కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 317